Begin typing your search above and press return to search.
పెళ్లెప్పుడంటే ప్రభాసూ ఇలాగే అన్నాడు..!
By: Tupaki Desk | 8 April 2022 3:28 AM GMTటాలీవుడ్ యువ హీరోలంతా పెళ్లితో ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పలువురు హీరోలు పెళ్లాడిన సంగతి తెలిసిందే. యూత్ స్టార్ నితిన్ .. భళ్లాల దేవ రానా.. ఎనర్జిటిక్ స్టార్ నిఖిల్ ప్రేమ వివాహాలతో హాట్ టాపిక్ గా మారారు. చరణ్ - బన్నీ లాంటి హీరోల సంగతి అటుంచితే అంతకుముందు గోపిచంద్ .. అల్లరి నరేష్ తదితర హీరోలు ఓ ఇంటివాళ్లయిన సంగతి తెలిసిందే. వీళ్ల వారసులు అప్పుడే ఎదిగేస్తున్నారు.
అయితే ప్రభాస్ మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తన స్థానాన్ని అలా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ ని విపరీతంగా అభిమానించే యువ మెగా హీరో కూడా అదే దారిలో వెళుతున్నట్టే కనిపిస్తోంది. పెళ్లెప్పుడు? అని ప్రశ్నిస్తే.. దానికి ఇంకా సమయం ఉందంటూ దాటవేస్తున్నాడు. ఇంతకీ ఎవరా మెగా యువహీరో అంటే.. ఇంకెవరు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ ప్రకటించేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ శుక్రవారం విడుదల కానున్న తన కొత్త చిత్రం 'గని' ప్రమోషన్ లో బిజీగా ఉన్న అతడు ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రణాళికల గురించి మాట్లాడుతూ..స్పష్టమైన సమాధానమిచ్చాడు. ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వరుణ్ చెప్పాడు.
నిజానికి కెరీర్ పరంగా అతడు పూర్తి బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం రకరకాల ప్రాజెక్ట్ లతో తీరిక లేకుండా ఉంటాడు కాబట్టి తన పెళ్లి గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం ఉండదని భావించాలి. వరుణ్ తదుపరి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించనున్నాడు. అంతే కాకుండా అతను తన పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం కూడా సిద్ధమవుతున్నాడు. అందులో ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడు.
అన్నట్టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కి బాహుబలి ముందు నుంచి కూడా ప్రతిసారీ ఇదే ప్రశ్న మీడియా నుంచి ఎదురవుతోంది. దానికి అతడు ఇప్పుడు లేదు.. అంటూ సమాధానమిస్తూనే ఉన్నాడు. ప్రతిసారీ జవాబు దాటవేస్తున్నాడు. బాహుబలి తర్వాత.. సాహో తర్వాత కూడా పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నలకు అతడు ఇలానే సమాధానమిచ్చాడు.
ప్రభాస్ కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఊపిరాడే సన్నివేశం లేదు. ఇలాంటప్పుడు ఆ ముచ్చట కుదిరేది కాదు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే తీరుగా వరుస ప్రాజెక్టులతో ఊపిరాడనంత బిజీ అయిపోతుండడమే ఈ స్పష్ఠమైన ప్రకటనకు కారణమని భావించాలి. బెండ ముదిరితే సామెత వీళ్లకు వర్తించదు!!