Begin typing your search above and press return to search.

స‌లార్..ఆదిపురుష్..ప్రాజెక్ట్-k..గెలుపెవ‌రిది?

By:  Tupaki Desk   |   24 Oct 2022 11:31 AM GMT
స‌లార్..ఆదిపురుష్..ప్రాజెక్ట్-k..గెలుపెవ‌రిది?
X
డార్లింగ్ ప్ర‌భాస్ పుట్టిన రోజు వేడుక‌లు నిన్న‌టి రోజున ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేక్ష‌కాభిమానులు డార్లింగ్ కి విషెస్ తెలియ‌జేసారు. ఇక పుట్టిన రోజు స్పెష‌ల్ గా `స‌లార్`..`ప్రాజెక్ట్-కె`..`ఆది పురుష్` నుంచి సైతం బిగ్ ట్రీట్ అందేసింది. కొత్త పోస్ట‌ర్ల‌తో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. మ‌రి డార్లింగ్ బ‌ర్డ్ ట్రీట్ లో ది బె స్ట్ ట్రీట్ ఇచ్చిన పోస్ట‌ర్ ఏంటి? అంటే స‌లార్కే ప్రేక్ష‌కుల‌కు ప‌ట్టం క‌డుతున్నారు.

స్పెష‌ల్ లుక్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన డార్లింగ్ మాసివ్ లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. డార్లింగ్ కటౌట్ కి ప‌ర్పెక్ట్ గా ఆహార్యం మ్యాచ్ అయింది. మిగ‌తా రెండు పోస్ట‌ర్ల‌కంటే ఎక్కువ‌గా స‌లార్ పోస్ట‌ర్ కే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే పోస్ట‌ర్ ఉందంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బ‌ర్త్ డే పోటీలో గెలిచిన ఏకైక పోస్ట‌ర్ అంటూ ఫీబ్ డ్యాక్ ఇస్తున్నారు.

ఇక ప్రాజెక్ట్-కె నుంచి డ‌బుల్ కిక్ దొరుకుతుంద‌ని అభిమానులు ఆశించారు. కానీ మినిమం కింక్ అందివ‌క‌పోగా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ప్ర‌భాస్ లుక్ చూపించ‌కుండా కేవ‌లం ఐర‌న్ మ్యాన్ త‌ర‌హాలో ఉండే హ్యాండ్ మాత్ర‌మే చూపించారు. దీంతో ఫ్యాన్స్ కొంత అప్స‌ట్ కి గుర‌య్యారు. ఏదో ఊహించుకుంటే? ఇంకేదో జ‌రిగింది.

ప్ర‌భాస్ లుక్ ఇంకేదైనా రిలీజ్ చేసి ఉంటే బాగుండేద‌ని మ‌రికొంత మంది అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే ఆదిపురుష్ నుంచి రిలీజ్ అయిన‌ పోస్ట‌ర్ కూడా మ‌రోసారి అభిమానుల అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. తాజా పోస్ట‌ర్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ ప‌డుతున్నాయి. యూనిట్ పోస్ట‌ర్లు క‌న్నా ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ లో బోలెడంత క్రియేటివిటీ ఉందని కామెంట్లు వ‌స్తున్నాయి.

మొత్తంగా డార్లింగ్ బ‌ర్త్ డే పోస్ట‌ర్ లో స‌లార్ దే మ‌రోసారి పై చేయి అయింది. అప్ డేట్స్ ప‌రంగా చూస్తే ఆదిపురుష్‌ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్నారు. స‌లార్..ప్రాజెక్ట్ -కె చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.