Begin typing your search above and press return to search.
ప్రభాస్ `సలార్` ప్లాన్ మొత్తం మారిందా?
By: Tupaki Desk | 27 Sep 2022 12:31 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `సలార్`. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ కీలక షెడ్యూల్ ని ప్రారంభించారు. ప్రభాస్ మోకాలి శస్త్ర చికిత్స కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ కి బ్రేకిచ్చిన మేకర్స్ రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లలో షూటింగ్ మొదలు పెట్టారు.
ఈ తాజా షెడ్యూల్ కి ముందు రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటులు రెబల్ స్టార్ కృష్ణం రాజు తీవ్ర అనారోగ్య కారణాల వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి వల్ల ప్రభాస్ `సలార్` ప్లాన్ మొత్తం మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముందు ఈ మూవీని సాధారణంగా ఒకే పార్ట్ ని చేయాలనుకున్నారు. అయితే ఆ తరువాత కథ డిమాండ్ ని బట్టి రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందు కోసం షూటింగ్ షెడ్యూల్స్ ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే తాజాగా ఆ ప్లాన్ లో ఇప్పడు మార్పులు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ దాదాపు రెండు వారాలు పాటు షూటింగ్ ని అవాడ్ చేశారట. ఇదే ఇప్పడు `సలార్` షెడ్యూల్ లో భారీ మార్పులకు కారణంగా మారినట్టుగా తెలుస్తోంది.
ముందు అనుకున్న ప్లాన్ లో మార్పు జరిగే అవకాశం వుందని గ్రమించిన ప్రభాస్ 11వ రోజు పూర్తి కాగానే వెంటనే `సలార్ ` సెట్ లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. అయినా సరే రెండు వారాలు లేట్ కావడంతో `సలార్` షూటింగ్ షెడ్యూల్స్ లో భారీ మార్పులు చేయక తప్పడం లేదట. రీసెంట్ గా సెట్ లోకి ప్రవేశించిన ప్రభాస్ నేపథ్యంలో కథకు కీలకంగా నిలిచే 12 సెట్ లలో పలు కీలక ఘట్టాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ ని వచ్చే ఏడాది 2023, సెప్టెంబర్ 28న భారీ స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి `కేజీఎఫ్` ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటో గ్రఫీని, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ అందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.