Begin typing your search above and press return to search.
అబ్బో.. ప్రభాస్ ఆమెను నా స్వీటెస్ట్ అన్నాడే
By: Tupaki Desk | 4 March 2020 8:01 AM GMTబాహుబలి చిత్రంతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఆ తర్వాత సాహో చిత్రంతో మరోసారి తన సత్తా చాటాడు. సోషల్ మీడియాలో ప్రభాస్ ఉన్నా కూడా ఉన్నాడా లేదా అన్నట్లుగా ఉంటాడు. చాలా తక్కువగా పోస్ట్ లు పెడుతూ ఉంటాడు. అలాంటిది తాజాగా సాహో హీరోయిన్ శ్రద్ధ కపూర్ పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పాడు. అది కూడా చాలా క్యూట్ గా అందరి దృష్టిని ఆకర్షించేలా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ ‘నా స్వీటెస్ట్ అమృతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. సాహో చిత్రంలో శ్రద్ధ కపూర్ పేరు అమృత అనే విషయం తెల్సిందే. స్వీటెస్ట్ అంటూ శ్రద్ధకు శుభాకాంక్షలు చెప్పడంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ప్రభాస్ నుండి స్వీట్ బర్త్ డే విషెష్ అందుకున్న శ్రద్ధ లక్కీ అంటూ పలువురు సినీ స్టార్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో శ్రధ్దకు ఇంకా ఎంతో మంది ప్రముఖులు స్టార్స్ బర్త్ డే సందర్బంగా విషెష్ చెప్పారు. కాని ప్రభాస్ చెప్పిన శుభాకాంక్షలు మాత్రం చాలా స్పెషల్ అంటూ నెటిజన్స్ అంటున్నారు. ఎందుకంటే చాలా అరుదుగా ముఖ్యమైన వారికి మాత్రమే ప్రభాస్ ఇలా శుభాకాంక్షలు చెబుతాడు. ఇప్పుడు ఈమెకు చెప్పాడు కనుక ఖచ్చితం గా ఆమె ప్రభాస్ కు ముఖ్యమైన వ్యక్తి అంటున్నారు.