Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో 'రాధేశ్యామ్' ఎంత రాబట్టిందంటే..?
By: Tupaki Desk | 14 March 2022 2:41 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్''. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
'రాధేశ్యామ్' సినిమాకి మొదటి మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కలిపి రూ. 47.40 కోట్ల షేర్ వసూలైనట్లు తెలుస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ డేకి మంచి నంబర్స్ నమోదు చేసిన ప్రభాస్ మూవీ.. రెండో రోజు బాగానే హోల్డ్ చేసింది. అయితే ఆదివారం కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం కాస్త ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 25.78 కోట్లు రాబట్టిన 'రాధేశ్యామ్'.. మూడు రోజుల్లో 47.32 కోట్లు వసూలు చేయగలిగింది. ఆదివారం నంబర్స్ లో తగ్గుదల కనిపించడంతో రాబోయే వారంలో ఇంకా డ్రాప్ అయ్యే సూచనలు ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 105 కోట్లకు చేరుకోవడం భారీ టాస్క్ గా మారుతుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
AP/TS 'రాధేశ్యామ్' సినిమా ఏరియా వైజ్ 3 రోజుల కలెక్షన్ల వివరాలు చూస్తే..
నైజాం - 21.50 Cr
సీడెడ్ - 6.60 Cr
యూఏ - 4.10Cr
గుంటూరు - 4.02 Cr
ఈస్ట్ - 3.87 Cr
వెస్ట్ - 3.02 Cr
కృష్ణ - 2.34 Cr
నెల్లూరు - 1.87 Cr
మొత్తం - 47.32 Cr
ఇకపోతే 'రాధేశ్యామ్' సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 79 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. మూడు రోజుల్లో 150 కోట్ల మార్క్ క్రాస్ చేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ పీరియాడికల్ లవ్ డ్రామాని నిర్మించారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇప్పటికే మెజారిటీ భాగం రికవరీ అయింది. మరి లాంగ్ రన్ లో థియేట్రికల్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.