Begin typing your search above and press return to search.

ఈ సారి ఇరగదీసేద్దామని అనుకున్నాను

By:  Tupaki Desk   |   24 Dec 2021 4:45 AM GMT
ఈ సారి ఇరగదీసేద్దామని అనుకున్నాను
X
ప్రభాస్ కెరియర్ ను తీసుకుంటే 'బాహుబలి'కి ముందు .. 'బాహుబలి'కి తరువాత అనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి ముందు కూడా ఆయనకి మాస్ యాక్షన్ హీరోగా ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎమోషన్స్ ను కూడా ఆయన పండించాడు. అయితే 'బాహుబలి' తరువాత ఆకాశమే హద్దుగా ఆయన క్రేజ్ పెరిగిపోయింది.

ఇక ఆ తరువాత సినిమాలను కూడా ఆయన ఆ స్థాయిలోనే నిలబెట్టవలసి వస్తోంది. ఆ క్రమంలో రూపొందిన మరో పాన్ ఇండియా సినిమానే 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జనవరి 14వ తేదీన వివిధ భాషల్లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ .. "లవ్ యూ టూ .. ట్రైలర్ మీరు లాంచ్ చేశారు .. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పెదనాన్నగారి ఫొటో చూశారు గదా .. ఎలా ఉన్నారు .. చిన్నసైజు దేవుడిలా ఉన్నారు కదూ. గోపీకృష్ణ మూవీస్ పై ఆయన చాలా పెద్ద సినిమాలు నిర్మించారు. మనవూరి పాండవులు .. బొబ్బిలి బ్రహ్మన్న .. తాండ్రపాపారాయుడు సినిమాలను చేశారు.

గోపీకృష్ణ మూవీస్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్టు 'బిల్లా' చేశాము .. బాగానే ఆడింది. ఇప్పుడు 'రాధేశ్యామ్' చేశారు. ఇది లవ్ స్టోరీనా? అంటే లవ్ స్టోరీనే కానీ .. చూశారుగా షిప్పులు గిప్పులు చాలా ఉన్నాయేవో. కోవిడ్ టైమ్ లో మా ప్రొడ్యూసర్స్ .. డైరెక్టర్ చాలా కష్టపడి చేశారు. హైదరాబాద్ .. జార్జియా .. ఇటలీలో ఈ సినిమా షూటింగును చేయడం జరిగింది. ఈ సినిమాలో చేసిన సీనియర్ నటులైన పెదనాన్నగారికి .. సత్యరాజ్ గారికి .. భాగ్యశ్రీ గారికి .. జయరామ్ గారికి .. సచిన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను.

జగపతిబాబుగారు ఈ సినిమాలో గెస్టుగా కనిపిస్తారు .. చాలా మంచి కేరక్టర్. నేను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నానని అంటున్నారు .. మనోజ్ గారు అలా చూపించారు. జస్టిన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. పూజ హెగ్డే చాలా బ్యూటిఫుల్ గా ఉంది .. బావుందా పూజ హెగ్డే .. ఓకే .. ఓకే. పోలీస్ వారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి .. చాలా కోపరేట్ చేశారు. ప్రెస్ వారు ఇండియాలోని చాలా చోట్ల నుంచి వచ్చారు .. అందరికీ కూడా థ్యాంక్స్. ఐదేళ్ల పాటు ఒక సినిమాపై కూర్చోవడమంటే జోక్ కాదు.

సినిమా మొదలై .. మళ్లీ ఆగి .. మళ్లీ స్టార్ట్ చేసి .. మళ్లీ ఆపడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ట్రైలర్ చూసిన తరువాత అవన్నీ మరిచిపోయాము. సినిమాలో చాలా మలుపులు .. చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరంతా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. క్లైమాక్స్ హైలైట్ అవుతుందని అనుకుంటున్నాను.

నవీన్ గారికి లాస్ట్ మినిట్ లో చెప్పాము .. అయినా హైలైట్ చేశారు. 'సాహో' సమయంలో నేను ఇండియా అంతా తిరిగి సిగ్గనేది పోయి బాగా మాట్లాడేస్తానని అనుకున్నానుగానీ .. పోలేదండీ .. ఇది ఇక అంతేనేమో. ఈ సారి ఎలాగైనా ఇరగదీసేద్దామని అనుకున్నాను. అంతే .. ఒక్కోసారి మాత్రమే వస్తుందేమో. ఎనీవే డాళింగ్స్ ఈ రోజు అంతా మీ వల్లే .. లవ్ యు సోమచ్" అంటూ ముగించారు.