Begin typing your search above and press return to search.
‘శ్రీదేవి సోడా సెంటర్’ కోసం ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ..!
By: Tupaki Desk | 26 Aug 2021 2:30 PM GMT'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు - ఆనంది జంటగా నటించిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ''శ్రీదేవి సోడా సెంటర్''. విజయ్ చిల్లా - శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో శరవేగంగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భాగం అయ్యారు. కంటెంట్ నచ్చితే సినిమా పబ్లిసిటీకి తన వంతు సహకారం అందించే ప్రభాస్.. ఈ సినిమా కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హీరో - దర్శక నిర్మాతలతో కలసి మన డార్లింగ్ కాసేపు ముచ్చటించారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. విజయ్ చిల్లా తనకు ఎప్పటినుంచో స్నేహితుడని.. తను 'శ్రీదేవి సోడా సెంటర్' టీజర్ చూపించిన వెంటనే బాగా నచ్చిందని అన్నారు. హీరోయిన్ నటన చాలా బాగుందని చెప్పిన ప్రభాస్.. సుధీర్ బాబు బాడీ - ‘గ్లిమ్స్ ఆఫ్ సూరిబాబు' లో బోట్ రేస్ - ఆ టైటిల్ పెట్టడానికి గల కారణాలతో పాటుగా సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ.. ''ఈ సినిమా కథ ప్రభాస్ కి చెప్పాను. సాధారణంగా ప్రభాస్ ఏదైనా కథ చెబితే ఓకే అంటాడు. కానీ ఈ కథ చెబుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఏమైంది? అని అడుగుతూనే ఉన్నాడు'' అని చెప్పారు.
అలానే సుధీర్ బాబు మాట్లాడుతూ.. 'కథ విన్న వెంటనే కొంచెం భయంగా అనిపించింది. ఫిజికల్ గా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. షూట్ ప్రారంభించిన మొదట్లోనే ఫిజిక్ చూపించే షాట్స్ చిత్రీకరించాలని అనుకున్నాం. కానీ అది ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చి చివర్లో షూట్ చేశాం. దానివల్ల కొంత ఇబ్బందిపడ్డాను. షూట్ లో చిన్న చిన్న గాయాలు అయ్యాయి' అని తెలిపారు. ''స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఇందులో తప్పకుండా తెలుగమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాం. వాళ్లు అయితేనే గోదావరి భాషలో మాట్లాడగలరని భావించాను. కథ రెడీ చేసుకున్నాక.. ఎంతోమందిని ఆడిషన్స్ లుక్ టెస్ట్ లు కూడా చేశాం. చివరికి ఆనంది ని సెలక్ట్ చేశాం. మంచి కథతో సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ప్రేక్షకుడి మదిలో గుర్తుండిపోతుంది'' అని కరుణ కుమార్ అన్నారు. ఇంకా 'శ్రీదేవి సోడా సెంటర్' టీమ్ తో ప్రభాస్ జరిపిన సరదా ముచ్చట్లు తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ చూసేయండి..!