Begin typing your search above and press return to search.
మాకు థియేటరే గుడిలాంటిది: ప్రభాస్
By: Tupaki Desk | 4 Aug 2022 4:00 AM GMTప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాలలో 'ప్రాజెక్టు K' ఒకటి. అశ్వనీదత్ బ్యానర్లో .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది.
కథాకథనాల పరంగా ఈ సినిమా ప్రయోగమైతే .. బడ్జెట్ పరంగా చూసుకుంటే సాహసంగానే కనిపిస్తుంది. ఈ సినిమాతో వైజయంతి మూవీస్ బ్యానర్ తో ప్రభాస్ కి మరింత చనువు ఏర్పడింది. ఈ కారణంగానే ఈ బ్యానర్ పై నిర్మితమైన 'సీతా రామం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. ప్రభాస్ నేరుగా స్టేజ్ పై నుంచే ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఈ స్టేజ్ పై ప్రభాస్ మాట్లాడుతూ .. " ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పుడే చూశాను .. ఎవరు కట్ చేశారోగాని చాలా బాగా వచ్చింది. దుల్కర్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో .. సూపర్ స్టార్. అలాగే మృణాల్ గొప్పగా చేసిందని చెబుతున్నారు. ఒక ప్రేమకథకు ఇంత ఖర్చు పెట్టి ఈ స్థాయిలో తీయడం అంత తేలికైన విషయం కాదు.
ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు .. యుద్ధం కూడా ఉందని అంటున్నారు. రష్యాలో కూడా తీశామని చెబుతున్నారంటే ఏ స్థాయిలో తీశారనేది అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు ఈ సినిమాను ఒక పోయెట్రీలా తీశారని నాగ్ అశ్విన్ నాకు చెప్పారు.
సుమంత్ .. నా డాళింగ్ .. ఆయన చేశాడంటే ఆ పాత్రలో ఏదో విషయం ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అదేమిటో తెలుగుకోవాలని ఉందిగానీ ... నాగ్ అశ్విన్ చెప్పడం లేదు. అశ్వనీదత్ గారు ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో పెద్ద సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ తోనే గొప్ప సినిమాలు చేసిన నిర్మాత ఆయన. అలాంటి ఒక నిర్మాత తెలుగులో ఉండటం అదృష్టంగా చెప్పుకోవాలి. రష్యా వెళ్లి .. కశ్మీర్ వెళ్లి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అలాంటి సినిమాలను థియేటర్స్ లోనే చూడాలి. ఇది థియేటర్లో మాత్రమే చూసే సినిమా.
మన ఇంట్లో పూజగది ఉందని చెప్పేసి .. గుడికి వెళ్లడం మానేస్తామా? సినిమా ఫీల్డ్ లో థియేటరే గుడి .. ఆ స్థానం మీరు ఇచ్చిందే. అందువలన ఈ సినిమాను థియేటర్ లోనే చూడండి. రష్మిక వంటి టాలెంటడ్ ఆర్టిస్టులు .. టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. అలాంటి ఒక సినిమాను అంతా చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు. భూమిక .. ప్రకాశ్ రాజ్ .. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన విడుదలవుతోంది.