Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఇంకా కొన్నాళ్లు దుబాయ్ లోనే
By: Tupaki Desk | 14 May 2018 8:17 AM GMTబాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆయనతో సినిమా అంటేనే కోట్లకు కోట్లు చేతిలో పెట్టుకుని రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. బాహుబలి తరువాత అతను చేస్తున్న సినిమా సాహో. దీనిపై మామూలు అంచనాలు లేవు... ఆ అంచనాలను అందుకోవాలనే చిత్రయూనిట్ తెగ శ్రమిస్తోంది. కొన్ని రోజులుగా దుబాయ్ భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పుడు దానిని మరిన్ని రోజులు పొడిగించాడంటా ప్రభాస్. ప్రభాస్ చెప్తే చేయాల్సిందే కదా.
సాహో భారీ బడ్జెట్ సినిమా. మొదట ఈ సినిమా కోసం 150 కోట్లు ఖర్చుచేయాలనుకున్నారు. కానీ ఆ ఖర్చు రూ.300 కోట్లకు చేరింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న చిత్రమిది. దుబాయ్ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం హాలీవుడ్ స్టంట్ మ్యాన్లను తీసుకొచ్చారు. ట్రాన్స్ ఫార్మర్స్ వంటి సినిమాలకు పని చేసిన స్టంట్ మాస్టర్లు సాహో కోసం పనిచేస్తున్నారు. ఇందు కోసం వారికి భారీగానే ముట్టచెప్పారు. ఈ యాక్షన్ సన్నివేశాలలో హైఎండ్ బైక్స్ లక్సరీ కార్సు హిటాచీ ట్రక్కులను వాడారు. అంతేకాదు పెద్ద ఫ్లై ఓవర్ నుంచి హీరో జంప్ చేసే సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. భారీ జంప్‌లు ఫైట్‌లు చేసి ప్రభాస్ ఒళ్లు హూనమైపోతోందట. అందుకే షూటింగ్ అనుకున్నదానికంటే కాస్త లేటుగా అవుతోందట. ప్రభాస్ షెడ్యూల్ జూన్ వరకు పొడిగించమని కోరాట. అందుకు చిత్ర యూనిట్ సమ్మతించింది.
సాహో సినిమాతో ప్రభాస్ హిందీలోనూ తెరంగేట్రం చేస్తున్నాడు. తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ లీడ్ రోల్ చేస్తోంది. తెలుగుతో పాటూ బాలీవుడ్ నటీనటులను కూడా సినిమాలో బాగానే పెట్టారు. సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది చివరికి విడుదలయ్యే అవకాశం ఉంది. లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగుతుందేమో అని అంచనా వేస్తున్నారు సినీ జనాలు.