Begin typing your search above and press return to search.
60 రోజులు రాముడు గెటప్ లోనే ప్రభాస్
By: Tupaki Desk | 8 Sep 2021 4:31 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `ఆదిపురుష్ 3డి` చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు..హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్ నిర్మాణంలో ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇతిహాసం `రామాయాణం` ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ పాత్రలో నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ లంకేష్ పాత్రలో...సన్ని సింగ్ లక్ష్మణ్ పాత్రలో కనిపించనున్నారు. కృతి సనోన్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిక్ కంటెంట్... బిగ్ స్టార్స్ అంతా ఆదిపురుష్ లో నటిస్తుండటంతో పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అవుతుంది.
మిగతా నటుల్ని పక్కనబెడితే ప్రభాస్ ఒక్కడే సినిమాని వన్ మేన్ ఆర్మీలా నడింపించాల్సి ఉంటుంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ బాక్సాఫీస్ వసూళ్లపై నమ్మకాన్ని పెంచుతోంది. జాతీయ స్థాయిలో తనకు ఉన్న గుర్తింపు సినిమాకు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. షూట్ లో భాగంగా ప్రభాస్ 60 రోజుల పాటు రాముడు గెటప్ లో ఉంటారుట. రామాయణాన్ని రచించిన వాల్మికి రాముడి పాత్రకు రామాయణంలో ఇచ్చిన ప్రాముఖ్యత అలాంటింది . రచన మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ రామనామ స్మరణ చేస్తూ వాల్మీకి ఈ కథనాన్ని పూర్తి చేశారు.
ప్రతీ పేజీలోనూ రాముడి ఔన్నత్యం కనిపిస్తుంది. అంటే సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత కీలకంగా ఉండబోతుందో ? మరోసారి స్పష్టమైంది. రాముడిలోని సెన్సిబుల్ అంశాలతో పాటు.. యుద్ద విన్యాసాల్లో రాముడి శౌర్యాన్ని అదే స్థాయిలో హైలైట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. చిత్రీకరణ కొన్ని నెలలు పాటు సాగనుంది. అన్ని పనులు పూర్తిచేసి 2022 ఆగస్ట్ 14న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.