Begin typing your search above and press return to search.

బాహుబలి తర్వాత దుబాయ్ డేస్!!

By:  Tupaki Desk   |   25 Nov 2016 6:21 AM GMT
బాహుబలి తర్వాత దుబాయ్ డేస్!!
X
బాహుబలి: ది కంక్లూజన్ షూటింగ్ ను ఫైనల్ స్టేజ్ కు వచ్చేశాడు ప్రభాస్. నాలుగేళ్లుగా బాహుబలి ఒక్క ప్రాజెక్టుకే వర్క్ చేస్తున్న ప్రభాస్.. మరికొన్ని రోజుల్లోనే తన వంతు షూటింగ్ పూర్తి చేసేయనున్నాడు. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని.. రన్ రాజా రన్ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో.. ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీ చేసేందుకు యంగ్ రెబెల్ స్టార్ సిద్ధమవుతున్నాడు.

బాహుబలి2 ఫినిషింగ్ కు వచ్చేయడంతో.. సుజిత్ ఏర్పాట్లు మొదలైపోతున్నాయి. ఈ సినిమా కోసం దుబాయ్ తో పాటు పలు గల్ఫ్ దేశాల్లో 70 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. స్క్రిప్ట్ ప్రకారం ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్ ఉండాల్సిందేనని తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ యాక్షన్ సీన్స్ నే పిక్చరైజ్ చేయనున్నారు. ప్రభాస్-సుజిత్ ల మూవీలో హాలీవుడ్ రేంజ్ లో స్టంట్స్ ఉంటాయట. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు.

మిషన్ ఇంపాజిబుల్4 కోసం బుర్జ్ ఖలీఫా దగ్గర టామ్ క్రూజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ కు సమానంగా.. ప్రభాస్ మూవీలోనూ ఓ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మాణం కానున్న ఈ మూవీ కోసం.. ప్రస్తుతం అవసరమైన అనుమతులు.. ట్రాన్స్ పోర్ట్ వంటి పనులు ప్రారంభించేశారు. బాహుబలి కాకుండా.. ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడనే వార్తే.. రెబెల్ స్టార్ అభిమానులను ఉత్సాహం తెప్పించేస్తోంది. సో జనవరి నుండి దుబాయ్ డేస్ స్టార్టయ్యే ఛాన్సుంది. గెట్ రెడీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/