Begin typing your search above and press return to search.

కట్టప్ప కొడుకు కోసం ప్రభాస్ సపోర్ట్

By:  Tupaki Desk   |   4 July 2022 7:58 AM GMT
కట్టప్ప కొడుకు కోసం ప్రభాస్ సపోర్ట్
X
రెబల్ స్టార్ ప్రభాస్ కొన్నిసార్లు ఎక్కువగా తన సినిమాల కంటే ఇతర సినిమాలకు ప్రమోట్ చేసే విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో అంతగా హడావిడి చేయని ప్రభాస్ కేవలం ఏవైనా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఉంటేనే పోస్టులు చేస్తూ కనిపిస్తూ ఉంటాడు.

ఇక అతనికి సంబంధించిన విషయాలు మాత్రం ఎన్నడూ కూడా ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది లేదు. రీసెంట్గా తన చిరకాల స్నేహితుడు గోపీచంద్ కోసం పక్క కమర్షియల్ సినిమా ఈవెంట్ కోసం ప్రభాస్ వస్తాడు అని అందరూ అనుకున్నారు.

కానీ ప్రభాస్ బిజీగా ఉండడం వలన రాలేకపోయాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ సినిమా చిత్ర యూనిట్ సభ్యులకు విషెస్ అందిస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకున్నాడు. ఇక ఇప్పుడు బాహుబలి కట్టప్ప సత్యరాజ్ వారసుడికి కూడా ప్రభాస్ తన వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ సత్యరాజ్ తో మంచి పరిచయం ఏర్పడింది. అంతకుముందే వీరు మిర్చి సినిమాలో కూడా తండ్రి కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే.

కానీ బాహుబలి ద్వారా ఐదేళ్ల సినీ ప్రయాణంలో కట్టపతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక ఇప్పుడు అదే స్నేహంతో సత్యరాజ్, ప్రభాస్ ను తన కొడుకు సినిమాకు సపోర్ట్ చేయమని కోరడంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేశాడు. సత్యరాజ్ కొడుకు సీబీ సత్య రాజ్ ఇటీవల హీరోగా చేసిన మాయెస్ అనే సినిమా త్వరలోనే తెలుగు తమిళంలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది.

తెలుగులో ఏకంగా ఈవెంట్ ద్వారా తన కొడుకు సపోర్ట్ చేయాలని సత్యరాజ్ ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సీబీ సత్యరాజ్ మద్దతు ఇస్తూ గుడ్ లక్ అయితే చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమా జూలై 7న విడుదల కాబోతోంది అని ట్రైలర్ కూడా పోస్ట్ చేశాడు.

ఇక సత్యరాజ్ కొడుకు చాలాకాలంగా తన తండ్రి కి తగ్గ తనయుడిగా అనిపించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు. ఇక ఇప్పుడు మాయెస్ అనే డిఫరెంట్ అడ్వెంచర్ త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.