Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్ గా మారి కుర్రహీరోకి లైఫిచ్చిన ప్రభాస్
By: Tupaki Desk | 31 May 2021 5:53 AM GMTఇండస్ట్రీలో నిలబడాలంటే గాడ్ ఫాదర్ ఉండాలని అంటారు. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా పరిశ్రమ పెద్దన్న ఒకరు సాయం చేస్తేనే యువతరం హీరోలకు మనుగడ. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోలు ఇక్కడికి వచ్చాక పెద్దలకు విధిగా మొక్కాలి. లేదంటే కేర్ లెస్ అని ఇండస్ట్రీ దూరం పెట్టేస్తుంది. అలాగే ఇక్కడ ప్రతిభతో పాటు సత్ప్రవర్తన ఒదిగి ఉండే స్వభావం కూడా దరిచేరనిస్తాయి. మంచితనంతో అందరినీ ఆకట్టుకుని దూసుకుపోయేవాడికి ఈ పరిశ్రమ బోలెడన్ని అవకాశాలిస్తుంది. వీటన్నిటికీ తోడు లక్ కలిసి రాకపోతే హిట్టు కొట్టక పోతే ఇంకేదీ లేదు.
నిజానికి వర్షం డైరెక్టర్ శోభన్ వారసుడు సంతోష్ శోభన్ చాలా కాలంగానే ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. పేపర్ బోయ్-తను నేను అనే రెండు సినిమాలు చేసినా అవి ఫ్లాపయ్యాయి. అయితే అతడి ప్రయత్నం గురించి తెలిసిన ప్రభాస్ వెంటనే తనకు అండగా నిలిచారు. తన సొంత బ్యానర్ యువి క్రియేషన్స్ లో అవకాశం కల్పించారు. అలాగే తన కమ్యూనికేషన్ లో ప్రముఖ బ్యానర్లతోనూ ముచ్చటించి సంతోష్ కెరీర్ కి అండగా నిలిచారు.
తాజాగా సంతోష్ శోభన్ నటించిన `ఏక్ మినీ కథ` ఓటీటీలో రిలీజై ఆదరణ దక్కించుకుంది. యువిక్రియేషన్స్ అనుబంధ బ్యానర్ యువి కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ సినిమాకి సమీక్షలు బావున్నాయి. సంతోష్ నటనకు పేరొచ్చింది. బోల్డ్ ఎటెంప్ట్ అయినా తెలివైన ఎటెంప్ట్ అన్న ప్రశంసలు దక్కాయి. రిలీజ్ ముందే ఓటీటీ డీల్ తో నిర్మాతలు లాభాలార్జించారు. దీంతో ఇప్పుడు మహానటి నిర్మాతలు స్వప్న సినిమాస్ లో సంతోష్ హీరోగా ఓ చిత్రం ఖాయమైంది. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ - మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రముఖ బ్యానర్లు సంతోష్ కి అవకాశాలిస్తున్నాయని తెలిసింది. ఇక ఈ బ్యానర్లతో ప్రభాస్ కి ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసినదే.
సంతోష్ తండ్రి శోభన్ 2008లో గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. దీంతో ప్రభాస్ ఆ లోటును భర్తీ చేసేందుకు తనకు వర్షం లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన శోభన్ వారసుడిని ఇప్పుడు ఆదుకుంటున్నారు. రెండేళ్లుగా సంతోష్ కెరీర్ పై ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిసింది. ఎంత పెద్ద హీరో అయినా ఒక్క అడుగుతోనే ముందుకు సాగాలి. ప్రభాస్ అంతటివాడే ఈశ్వర్- రాఘవేంద్ర లాంటి ఆరంగేట్ర చిత్రాలతో ఫ్లాపులందుకున్నాడు. ఆ తర్వాతే వర్షం లాంటి క్రేజీ ఆఫర్ తనని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఏక్ మినీ కథ తర్వాతా సంతోష్ కి మంచి హిట్లు పడితే అతడు కూడా పెద్ద హీరోగా ఎదిగేస్తాడేమో!! ఏదేమైనా తనకు లైఫిచ్చిన దర్శకుడి వారసుడికి ప్రభాస్ లైఫిస్తున్నారు. ఇది అన్నివేళలా హర్షణీయం.