Begin typing your search above and press return to search.
'సాహో' ఎఫెక్ట్ తో ప్రభాస్ ముందు జాగ్రత్త
By: Tupaki Desk | 16 Oct 2019 2:30 PM GMTబాహుబలి' చిత్రంతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ గుర్తింపు దక్కించుకున్నాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్ తో యావరేజ్ టాక్ దక్కించుకున్న సాహో చిత్రం దాదాపుగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. సాహో చిత్రంతో మరోసారి ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. సాహో చిత్రంతో కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి ఉంటే నిర్మాతలకు బయ్యర్లకు అందరికి లాభాలు వచ్చేవి. కాని సాహో చిత్రం బడ్జెట్ కాస్త ఎక్కువ అయ్యింది. సాహో ఫలితం నేపథ్యంలో ప్రభాస్ తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రభాస్ ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్ ' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎక్కువ శాతం ఇటలీకి సంబంధించిన సీన్స్ ఉంటాయట. ఈ చిత్రంకు కూడా భారీగానే బడ్జెట్ ను ఖర్చు చేయాలని మొదట అనుకున్నారు. కృష్ణం రాజుతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు.
సాహో ఫలితం నేపథ్యంలో 'జాన్ ' చిత్రం బడ్జెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని.. హద్దుల్లో ఉండి ఖర్చు చేయాలంటూ ప్రభాస్ నిర్మాతలకు సూచించాడట. మరీ ఎక్కువ ఖర్చు చేస్తే సినిమా సక్సెస్ అయినా ఫలితం ఉండటం లేదని.. అందుకే నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలనే నిర్ణయానికి ప్రభాస్ అండ్ టీం వచ్చారు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే దాదాపుగా 50 కోట్లు జాన్ కు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.