Begin typing your search above and press return to search.
శ్రీరాముడిగా నటించడంలో సవాల్ ఏంటో చెప్పిన ప్రభాస్
By: Tupaki Desk | 26 April 2021 9:30 AM GMTపురాణేతిహాసం రామాయణం స్ఫూర్తితో ఆదిపురుష్ 3డిని ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్.. లంకేయునిగా సైఫ్ ఖాన్.. సీతగా కృతి సనోన్ నటిస్తున్నారు. అయితే శ్రీరాముడిగా నటిస్తున్న ప్రభాస్ ఆ పాత్ర కోసం ఎలా ప్రిపేరవుతున్నారు? ఆయన ఒత్తిడికి గురవుతున్నారా? అంటే.. దానికి ఆయన నుంచే సమాధానం వచ్చింది.
``శ్రీరాముడిగా నటించడం అనుకున్నంత సులువేమీ కాదు. సవాళ్లతో కూడుకున్న ప్రయత్నమిది. రాముడి వ్యక్తిత్వాన్ని మూర్తీభవించాలంటే చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. చాలా సినిమాల విజువల్స్ చూడవలసిన అవసరం ఉంది. శ్రీరాముడిగా కనిపించాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి. ప్రజలు ప్రతిదీ చూస్తారు`` అని అన్నారు. రాముడి పాత్రను పోషించడం ఇతర జానపద చిత్రాల నుండి ఒక పాత్రను పోషించడం లాంటిది కాదని.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అతిగా తినకూడదని అన్నారు.
మాయాబజార్ కు ముందు సీనియర్ ఎన్టీఆర్ ని ప్రేక్షకులు శ్రీకృష్ణుడిగా తిరస్కరించారని.. ఇది ఆయన ఆత్మవిశ్వాసాన్ని బాగా ప్రభావితం చేసిందని.. అయితే దర్శకుడు కెవి రెడ్డి మాయాబజార్ చిత్రంలో అతడిని సరైన విధానంలో ఆవిష్కరించారని ప్రభాస్ నాటి హిస్టరీని గుర్తు చేశారు. మరోసారి మయబజార్ లో ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడిగా సరైన దుస్తులతో సరైన క్యారెక్టరైజేషన్ తో కెవి రెడ్డి గారు ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన తెలుగు సినీ పరిశ్రమలో శ్రీకృష్ణుడిగా గొప్ప గుర్తింపును భక్తితో కూడుకున్న ఆరాధనాభావాన్ని సాధించారు! అని ప్రభాస్ తెలిపారు. మొత్తానికి ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. బాహుబలి లో అమరేంద్ర బాహుబలిగా శివుడిగా నటించినంత ఈజీ కాదు శ్రీరాముడిగా నటించడం అంటే... ! ఇదీ ప్రభాస్ ఉద్ధేశం. నిజమే శ్రీరాముడి రూపానికి ఆంజనేయుడి తోకను జోడించి అవతార్ ని క్రియేట్ చేసిన కామెరూన్ లా ఇప్పుడు ప్రభాస్ ని లార్డ్ రాముడిగా ప్రెజెంట్ చేయడంలో ఓంరౌత్ ఇంకేదైనా క్రియేటివిటీ చూపిస్తున్నారా? అన్నది చూడాలి.
ప్రభాస్ ఇటీవల వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సలార్ చిత్రీకరణతో పాటు ఆదిపురుష్ షూటింగ్ ని చేస్తున్నారు. కరోనా బంద్ కి ముందు ముంబైలో ఆదిపురుష్ షెడ్యూల్ పూర్తి చేసారు. 30శాతం షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ఓంరౌత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ 3డి ఆగస్టు 2022 లో విడుదల కానుంది.