Begin typing your search above and press return to search.
వీడియో: ప్రభాస్..రాజు ఎక్కడున్నా రాజేరా!
By: Tupaki Desk | 29 Sep 2022 12:30 PM GMTరెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా 12 ఏళ్ల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సొంతూరు మొగల్తూరు కి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఇంటి వద్దకు భారీగా ప్రేక్షకాభిమానులు చేరుకున్నారు. ప్రభాస్ వస్తున్నాడు? అన్న విషయాన్ఇన తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామ వాసులంతా ముందుగానే సమీప ప్రాంతానికి చేరుకున్నారు.
చుట్టు పక్కల జిల్లాల వాసులు ప్రభాస్ ని చూసేందుకు వెళ్లారు. తాజాగా ప్రభాస్ ఇంటి నుంచి ప్రేక్షకాభిమానులకు అభివాదం చేస్తోన్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ ని చూడగానే అభిమానులు ఈలలు..కేరింతలకి అదుపులేదు. ప్రభాస్ బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేస్తుండగా...అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్.
ప్రభాస్ ని తమ సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు. మరికొంత మంది దూరం నుంచే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. డార్లింగ్ అందరకి చేయి ఊపుతూ అభివాదం చేసారు. ఆ తర్వాత కృష్ణంరాజు భార్య..పెద్దమ్మ శ్యామలా దేవి అభిమానులకు అభివాదం చేసారు. ఈ క్రమంలోనే శ్యామలా దేవి కన్నీటి పర్యంతం చెందారు. ఇక వీడియో బ్యాక్ గ్రౌండ్ ని మిర్చి సాంగ్ ని సింక్ చేసి ప్లేచేసారు.
'అడుగుమోపిన నిన్ను చూసి..అదిరిపడనాడు.. ఇక తనువు దాటి బయటపడగా.. పండగలా దిగివచ్చావ్... ప్రాణాలకు వెలుగిచ్చావ్వ్.. రక్తాన్నే ఎరుపెక్కించావ్' అంటూ సాగే పాటతో వీడియోని సింక్ చేసారు. ప్రభాస్ ఎంట్రీకి..ఫ్యాన్స్ కేరింతలకి సాంగ్ పర్పెక్ట్ గా సూటయింది. ఇక అభిమానుల కోసం ప్రభాస్ నోరూరించే వంటకాలు సైతం సిద్దం చేసిన సంగతి తెలిసిందే.
దాదాపు లక్ష మందికి వెజ్-నాన్ వెజ్ వంటకాలు చేసారు. ఆరు టన్నుల మటన్ కర్రీ... ఆరు టన్నుల మటన్ బిర్యానీ.. ఆరు టన్నుల చికెన్ బిర్యానీ.. టన్ను బొమ్మిడాల పులుసు.. టన్ను పీతల కూర... టన్ను రొయ్యల ఇగురు.. రెండు లక్షలు బూరెలు ఇలా దాదాపు 20 రకాల ప్రత్యేక వంటకాలు అభిమానులకు రుచి చూపించినట్లు తెలుస్తోంది. తమ సంప్రదాయ ప్రకారం సంస్మరణ సభని ఎంతో ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో రాజు ఎక్కడున్నా? రాజేరా అంటే 'బాహుబలి'లో బిజ్జలదేవ డైలాగ్ తో అభిమానులు ప్రశంసిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.