Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఆ ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్లతో?
By: Tupaki Desk | 22 Sep 2022 3:53 AM GMTడార్లింగ్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ చిత్రంతో 'తానాజీ' ఫేం ఓంరౌత్ ని పాన్ ఇండియా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు ప్రభాస్. అలాగే ప్రాజెక్ట్ కే లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాతో అశ్వనిదత్ అల్లుడు నాగ్ అశ్విన్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ తో పని చేస్తున్నాడు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో సంచలన రికార్డులు నమోదు చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా డార్లింగ్ ప్రభాస్ తో పని చేసేందుకు మరో ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్లు పక్కా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. ఇందులో స్టార్ డైరెక్టర్ శంకర్ ... ఏ.ఆర్. మురుగదాస్ పేర్లను కూడా తమిళ మీడియా పలు సందర్భాల్లో ఉదహరించింది.
కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి గౌతమ్ వాసుదేవ మీనన్ పేరు కూడా చేరింది. గౌతమ్ మీనన్ ఇటీవలి కాలంలో దర్శకుడిగా ఆశించిన విధంగా టేకాఫ్ కావడం లేదు కానీ అతడి క్లాసిక్ నేరేషన్ కి వీరాభిమానులున్నారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్లకు అతడు స్పెషలిస్ట్. గౌతమ్ మీనన్ సినిమాలకు హిందీ వ్యూవర్ షిప్ కూడా అసాధారణంగా ఉంది. 'చెలి' సినిమా నుంచి తనకంటూ దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుడు ఆయన. అందుకే అతడు ప్రభాస్ తో పని చేయాలనుందని అనగానే కొంత ఆసక్తి నెలకొంది.
అయితే ఆ ముగ్గురితో పని చేసేందుకు ప్రభాస్ ఆసక్తిగా ఉన్నాడా? అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. శంకర్ ఇప్పటికే భారతీయుడు 2తో పాటు చరణ్ కథానాయకుడిగా ఆర్.సి 15 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ సలార్ తర్వాత మరోసారి ప్రశాంత్ నీల్ తోనే పని చేసే ఆలోచనలో ఉన్నాడు. వరుసగా మూడు నాలుగు ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీ. అయితే ఏ.ఆర్.మురుగదాస్ స్క్రిప్ట్ తో డార్లింగ్ ని ఒప్పించాల్సి ఉంటుంది.
రామ్ తర్వాత ప్రభాస్ తో..!?
శింబు నటించిన తాజా చిత్రం 'వెందు తేనింధాతు కాదు' (ది లైఫ్ ఆఫ్ ముత్తు) థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు గౌతమ్ మీనన్ తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను రివీల్ చేసారు. పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయడం తనకు ఇష్టమని .. వారితో నిరంతరం టచ్ లో ఉంటానని కూడా చెప్పాడు. రామ్ పోతినేని ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
త్వరలో ది లైఫ్ ఆఫ్ ముత్తు పార్ట్-2ని గౌతమ్ మీనన్ ప్రారంభించనున్నారు. ప్రభాస్ తో పని చేయాలంటే అతడు ఇంకా చాలా సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కొన్ని కలయికలు క్రేజీగా ఉంటాయి. ప్రభాస్ - గౌతమ్ కలయికలో సినిమా కావాలని గౌతమ్ మీనన్ అభిమానులు బలంగా కోరుకుంటారనడంలో సందేహం లేదు. అది జరగాలనే ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.