Begin typing your search above and press return to search.

మహానుభావుడుకి బాహుబలి అండ

By:  Tupaki Desk   |   12 Sep 2017 12:21 PM GMT
మహానుభావుడుకి బాహుబలి అండ
X
బాహుబలి మూవీతో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అంచనా వేయడం చాలా క్లిష్టమైన విషయం. అంచనాలకు అందని స్థాయిలో తన రేంజ్ ను పెంచేసుకున్న బాహుబలి.. ఇప్పటికీ ఎంతో సింపుల్ గానే ఉండడం విశేషం. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ లో వచ్చిన మార్పులో స్పష్టంగా బయటకు తెలిసే విషయం.. ఇతరుల ఫంక్షన్స్ కు అటెండ్ కావడం.

శర్వానంద్ హీరోగా నటిస్తున్న మహానుభావుడు చిత్రం ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మహానుభావుడికి ఇప్పటికే ప్రచారం పీక్స్ లో ఉండగా.. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకి గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ కు యంగ్ రెబల్ స్టార్ చీఫ్ గెస్టుగా హాజరుకాబోతోన్నట్లు మారుతి అండ్ టీం ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దసరాకు రిలీజ్ కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా ఆడియో లాంఛింగ్ చేయిస్తుండడం.. క్రేజ్ మరింతగా పెంచుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

నిజానికి గతంలో కూడా ఇలా చాలా మంది పిలిచినా ప్రభాస్ సిగ్గరి కావడంతో పెద్దగా అటెండ్ అయ్యేవాడు కాదు. కానీ ఇప్పుడు తను నటించకపోయినా.. తన ప్రెజెన్స్ సినిమాల సక్సెస్ కు ఉపయోగపడుతుండడంతో.. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్నాడు ప్రభాస్. తన ఫ్రెండ్స్ కోసం కూడా ఈ మధ్య ఎక్కువగానే యాక్టివిటీస్ చేపడుతున్నాడు రెబల్ స్టార్.