Begin typing your search above and press return to search.

బాహుబలికి రేంజ్ రోవర్ ఫ్రీ.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   31 May 2016 4:28 PM GMT
బాహుబలికి రేంజ్ రోవర్ ఫ్రీ.. ఎందుకంటే?
X
ప్రస్తుతం ఇంటర్నేషనల్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కి.. ఓ కార్ ఉచితంగా అందడం పెద్ద విషయమేం కాదు. తమ కంపెనీ కార్ తో కలిపి ఓ ఫోటో తీసుకోనిస్తే చాలు.. మనోడికి ఆ కార్ ఫ్రీగా ఇచ్చేస్తామని కార్ తయారీ కంపెనీలు వెంటబడతాయి. అయితే.. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఖరీదైన కార్లయిన రేంజ్ రోవర్ ఒకటి.. ఇప్పుడు ప్రభాస్ కి ఫ్రీగా అందడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కొంతకాలం క్రితం బాహుబలి ఓ రేంజ్ రోవర్ కోసం ఆర్డర్ చేశాడు. అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ ఎస్ వి ఆటోబయోగ్రఫీ ఎడిషన్ ను అడిగాడు ప్రభాస్. పూర్తిగా కస్టమర్ అవసరాలు - టేస్టుకు తగినట్లుగా కస్టమ్ డిజైన్స్ తో లభించే ఈ కారు.. జూన్ నెల ప్రారంభానికే ప్రభాస్ కు అందాల్సి ఉంది. యూకే నుంచి ఇక్కడకు ఇంపోర్ట్ కావాల్సి ఉన్న ఆ కారు.. ప్రభాస్ కు ఆన్ టైంలో డెలివరీ చేయడంలో.. కంపెనీపూర్తిగా విఫలమైంది.

దీంతో ఆ కంపెనీ ఫార్ములా ప్రకారం.. ప్రభాస్ కి ఓ కొత్త రేంజ్ రోవర్ ను అప్పగించనుంది కంపెనీ. ప్రభాస్ ఆర్డర్ చేసిన ఎస్వీఆటోబయోగ్రఫీ మోడల్ చేరేవరకూ.. ప్రభాస్ దీన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చన్న మాట. అలా ఒక లగ్జరీ కారు ఆర్డర్ చేస్తే.. ఇంకో రేంజ్ రోవర్ ఫ్రీగా ఇంటికోచ్చేస్తోంది. ఇంత కంటే లక్ మరొకటి ఉండదు కదా.