Begin typing your search above and press return to search.
1960లోకి వెళ్తున్న ప్రభాస్
By: Tupaki Desk | 23 Sep 2017 6:25 AM GMTయంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లకు పైగా సమయాన్ని బాహుబలి కోసం వెచ్చించిన ప్రభాస్.. ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో చేసేస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ మూవీలో తన కొత్త స్టైల్ ను.. కొత్త తరహా యాక్షన్ సీక్వెన్స్ లను పరిచయం చేయబోతున్నాడు.
ఇప్పటికే ప్రభాస్ తన మరుసటి చిత్రానికి కూడా అంగీకరించేశాడనే టాక్ ఉంది. నిజానికి ప్రభాస్ ఓ బాలీవుడ్ మూవీ చేయాల్సి ఉంది. కానీ ముందుగా చేసుకున్న కమిట్ మెంట్స్ ప్రకారం.. తెలుగు సినిమాలనే చేస్తూ వాటినే ఇతర భాషల్లో కూడా రూపొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే సాహో చిత్రంలో నటులను ఎక్కువగా బాలీవుడ్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ మరుసటి చిత్రంపై కూడా ఓ అప్డేట్ వచ్చింది. ఇది కూడా తెలుగులోనే ప్రధానంగా రూపొందనుండగా.. ప్రభాస్ ఓ పీరియాడిక్ ఫిలింలో కనిపించబోతున్నడాని అంటున్నారు. ఇది 1960-70ల కాలంలో యూరోప్ లో జరిగిన పరిస్థితులను తలపించేలా ఉంటుందని ప్రభాస్ స్వయంగానే చెప్పేశాడు.
అయితే.. ఇది లవ్ స్టోరీ కాగా సినిమాలో ప్రధాన భాగం అంతా యూరోప్ లోనే షూట్ చేయబోతున్నారట. సాహో మూవీ ఫైనల్ దశకు రాగానే ఈ చిత్రం ప్రారంభించే యోచన ఉండగా.. ఈ మూవీ షూటింగ్ ను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసేలా షెడ్యూల్ చేసుకున్నట్లు ప్రభాస్ చెబుతున్నాడు. అంటే ఇక్కడి నుంచి 9 నెలల్లో రెండు సినిమాల షూటింగ్ లను ప్రభాస్ ఫినిష్ చేస్తాడన్న మాట. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ చేయబోయేది మాత్రం.. డైరెక్ట్ బాలీవుడ్ మూవీనే.