Begin typing your search above and press return to search.

ఢిల్లీ దసరా రావణ దహనం కి ప్రభాస్ దూరం!

By:  Tupaki Desk   |   14 Sep 2022 9:30 AM GMT
ఢిల్లీ దసరా రావణ దహనం కి ప్రభాస్ దూరం!
X
ఆదిపురుష్‌ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. దసరా రోజు ఢిల్లీలో రామ్‌ లీలా లో ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించి అక్కడ రావణ దహన కార్యక్రమం ను నిర్వహించడం ద్వారా ఆదిపురుష్ యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

ఈ రామ్‌ లీలా ఈవెంట్‌ రావణ దహణ కార్యక్రమంకు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా హాజరు అవ్వబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ నుండి సమాచారం అందుతోంది. కానీ ప్రభాస్ ఈ కార్యక్రమం కు దూరంగా ఉండే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రావణ దహణ కార్యక్రమం అనేది సినిమా కి మంచి పబ్లిసిటీ ఈవెంట్‌ గా నిలువబోతుంది.

అలాంటి ఈవెంట్‌ లో ప్రభాస్ పాల్గొంటే కచ్చితంగా దేశ వ్యాప్తంగా మంచి మైలేజ్ దక్కే అవకాశం ఉంది. కానీ పెదనాన్న కృష్ణంరాజు ఆకస్మిక మరణం కారణంగా పండుగ వేడుక అవ్వడం వల్ల ప్రభాస్ పాల్గొనకుండా రామ్‌ లీలాకి దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఒక వీడియో బైట్‌ ని ప్రభాస్ తో ఇప్పించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

ఆదిపురుష్ సినిమా హిందీలో రూపొందిన అతి పెద్ద భారీ బడ్జెట్‌ మోషన్ గ్రాఫిక్స్ మూవీ. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు.

సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నారు. సీతగా కృతి సనన్‌ నటించింది. షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అయ్యింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది.

ఓమ్‌ రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదుల కొద్ది భాషల్లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు కనుక వచ్చే ఏడాది ఆరంభంలో ఆదిపురుష్ రావడం పక్కా అంటూ ప్రభాస్‌ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.