Begin typing your search above and press return to search.
భీమవారం ఫ్యాన్స్ - . ప్రభాస్ అప్‌సెట్ అయ్యాడు!
By: Tupaki Desk | 5 Sep 2015 4:46 PM GMTనిన్నటి రోజున భీమవరంలో అభిమానుల కొట్లాట తెలుగు రాష్ర్టాల్లో విస్ర్తతంగా చర్చ కొచ్చింది. ప్రభాస్ అభిమానులు పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీల్ని చించేయడం తో పెద్ద దుమారం చెలరేగి కొట్లాట వెరకూ వెళ్లింది. గొడవ చినికి చినికి గాలి వానై ప్రభాస్ అభిమానులు, పవన్ అభిమానుల మధ్య వార్ కి తెర తీసింది. హీరోల ఫ్లెక్సీల్ని చించి, తగుల బెట్టే వరకూ పరిస్థితి వెళ్లడంతో పోలీస్ 144 సెక్షన్ విధించారు. రెండు దశాబ్ధాల కాలం లో ఫ్యాన్స్ విషయంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే.
అయితే పవన్ ఫ్లెక్సీ విషయం లో అభిమానుల్ని తప్పు పడుతూ ప్రభాస్ చీవాట్లు వేశాడని సమాచారం. ఇలా చేసినందుకు తీవ్రం గా హర్టవ్వడమే కాదు.. అభిమానుల్ని సమావేశపరిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడుట. భీమవరం ఫ్యాన్స్ తో ప్రభాస్ కుటుంబం సుదీర్ఘం గా చర్చించి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని కన్విన్స్ చేశారు. ఫ్లెక్సీ లు ధ్వంశాని కి కారకులైన వాళ్లు బాధ్యత వహించాలని ప్రభాస్ సూచించారు. అలాగే పబ్లిక్ ఆస్తుల్ని తగలబెట్టే ఇలాంటి చెడు పనులు చేయొద్దని సూచించాడు. ఇక్కడ అందరు హీరోలు ఒక్కటే. నువ్వు నంబర్ 1, నేను నంబర్ 1 అనేది ఉండదు... అని అభిమానులకు హిత బోధ చేశాడు.
అంతేకాదు అభిమానుల్లో కొందరు విద్యార్థులు బార్ల చుట్టూ తిరగడం తనకి నచ్చలేదని ప్రభాస్ సూటిగా అభిమానుల నుద్ధేశించి బాధపడ్డాడు. కెరీర్ ని ఇలా నాశనం చేసుకోవద్దని వారించాడు. నిజానికి పవన్ అభిమానుల్లో విద్యార్థుల్ని పోలీసులు ఎత్తుకెళ్లినా ఇలా జరగకూడదని ప్రభాస్ కాస్త బాధని వ్యక్తం చేశారు. ఏ హీరో సినిమా సక్సెసవ్వాలన్నా అందరు ఫ్యాన్స్ ఒకటి అయితేనే సాధ్యమని ప్రభాస్ చెప్పాడు. ఇది ప్రభాస్ లో ని జెంటిల్మన్ ని బైటి ప్రపంచానికి ఆవిష్కరించడమే. అభిమానులూ అర్థమైందా?