Begin typing your search above and press return to search.
ప్రభాస్ (Vs) అల్లు అర్జున్! ఫ్యాన్స్ తో ఊహించని ముప్పు
By: Tupaki Desk | 18 April 2022 1:05 AM GMTఅభిమానం హద్దు మీరనంత వరకూ ఓకే! హద్దు దాటి ప్రమాదాల్ని క్రియేట్ చేసేవరకూ వెళితే మాత్రం క్షమించరానిది. ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన ఇరువురు అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ ప్రమాదాలకు సంకేతంగా కనిపిస్తోంది.
ఇది ట్విట్టర్ వార్ అయినా ఇన్ స్టా - ఎఫ్.బి వార్ అయినా ఏదైనా కావొచ్చు. కానీ అభిమానుల ఫ్యానిజం హద్దు మీరుతోంది. ఒకరినొకరు తిట్టుకోవడం అనే విష సంస్కృతి ఇలాంటి మోడ్రన్ ప్రపంచంలోనూ కనిపిస్తోందనే ఆవేదన అలానే ఉంది. ఫ్యాన్స్ మధ్య అగ్లీ వార్ సదరు హీరోల బ్రాండ్ వ్యాల్యూని తగ్గిస్తుందని దీనివల్ల ఇరుగు పొరుగు మార్కెట్లలో విలువ పడిపోతుందని కూడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన హీరోల్ని మనమే కించపరుచుకోవడం సరైనది కాదని పలువురు ఎనలిస్టులు సూచిస్తున్నారు.
హీరోల్ని అభిమానించండి.. ప్రేమించండి. కానీ ఫ్యానిజం పేరుతో ఒకరినొకరు తిట్టుకోవడం బూతులు మాట్లాడడం సరైనది కాదు. డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ పబ్లిక్ కి కనెక్టయ్యి ఉంది. అలాంటి వేదికలపై బాధ్యతాయుతంగా మెలగండి. పైగా ప్రభాస్ - బన్నీ లాంటి అగ్ర హీరోలు ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటి పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారు.
ఇది ఎంతో గొప్ప ఫీట్. ప్రశంసనీయమైనది. వారి పనిని వారిని చేయనివ్వండి. మధ్యలో అనవసర గొడవలు వద్దు అని క్రిటిక్స్ సూచిస్తున్నారు. మీరు గొడవలాడొద్దు... గొడవల్లోకి దించొద్దు! అని కూడా హింట్ ఇస్తున్నారు. అల్లు అర్జున్.. ప్రభాస్ అభిమానులు ట్విట్టర్ వేదికగా వాంటెడ్ గా తమ లిమిట్స్ ని క్రాస్ చేస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం మంచి కల్చర్ కాదని సూచిస్తున్నారు. సోషల్ మీడియా వార్ వల్ల సూపర్ స్టార్లను చిన్నబుచ్చినట్టుగా తగ్గించినట్టుగా అవుతుంది. ఇది గమనించి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతారనే ఆశిద్దాం.
హిందీ ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోల హవా ఒక రేంజులో ఉంది. దీనిని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు ఫ్యాన్స్ అంతా కలిసి కట్టుగా రావాలి. ప్రభాస్ సినిమా బాలీవుడ్ లో భారీగా రిలీజైతే అక్కడా బన్ని అభిమానులు చరణ్ .. పవన్ అభిమానులు సలాం అంటూ ప్రచారం చేయాలి. లేదా బన్నీ సినిమా పవన్ సినిమానో రిలీజవుతోంది అంటే వీళ్లకు ప్రభాస్ అభిమానులు కూడా అంతే ఇదిగా ప్రమోషన్ చేయాలి.
మనవాళ్లను మనమే తగ్గించే తప్పుడు ప్రసంగాలు మాత్రం సోషల్ మీడియాల్లో చేయొద్దని సూచిస్తున్నారు. మనల్ని చూసి ఎదుటివాడు కుళ్లుకునేంతగా మనం ఎదుగుతున్నాం. ఇలాంటప్పుడు మనలో మనమే కలహాలతో కలతలు పెట్టుకోవడం సరికాదు.
మునుముందు సలార్ - ఆదిపురుష్ 3డి - పుష్ప 2 - ఆచార్య- చెర్రీ 15- హరి హర వీరమల్లు ఇవన్నీ హిందీ మార్కెట్ సహా పాన్ ఇండియా మార్కెట్లో విడుదలవుతున్నాయి. వీటన్నిటికీ అందరూ ఫ్యాన్స్ విధిగా బాధ్యతగా సరైన పంథాలో ప్రమోషన్ చేయాలని తుపాకి తరపున క్రిటిక్స్ కోరుతున్నారు.