Begin typing your search above and press return to search.

ఏఎంబీలో అభిమానుల‌తో డార్లింగ్

By:  Tupaki Desk   |   9 Sep 2019 12:39 PM GMT
ఏఎంబీలో అభిమానుల‌తో డార్లింగ్
X
ఏడాది పైగా శ్ర‌మించి ఎట్ట‌కేల‌కు `సాహో`ని థియేట‌ర్ల‌లోకి తెచ్చేసిన డార్లింగ్ ప్ర‌భాస్ క్రిటిసిజం ఎలా ఉన్నా.. తాను మాత్రం పాజిటివ్ యాటిట్యూడ్ తోనే అన్నిటినీ రిసీవ్ చేసుకున్నాడు. మాట‌ల్లో కాదు చేతల్లో చూపించాలి అన్న‌ట్టుగానే అత‌డి వ్య‌వ‌హార శైలి ఉంది. అప్ప‌ట్లో 200 కోట్ల క్ల‌బ్ పోస్ట‌ర్ ని స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసి ఇదీ రిజ‌ల్ట్ అంటూ సైలెంట్ గా ఫ్యాన్స్ కి ఎక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. అదంతా స‌రే కానీ.. సాహో చిత్రాన్ని ప్ర‌భాస్ ఇప్ప‌టికి ఎన్నిసార్లు చూసి ఉంటాడో కానీ.. మ‌రోసారి హైద‌రాబాద్ ఏఎంబీ సినిమాస్ కి వెళ్లి సినిమా చూసేశాడు. అది కూడా అభిమానుల మ‌ధ్య కూచుని సాహోకి స్పంద‌న ఎలా ఉందో ప‌రిశీలించాడు.

ఇప్ప‌టికే రెండో వారంలో అడుగు పెట్టారు కాబ‌ట్టి ఇప్పుడెలా ఉంది? అన్న‌ది చూడాల‌నుకున్నాడేమో.. ఈ సోమ‌వారం మ‌ధ్యాహ్నం `సాహో` రెస్పాన్స్ క్రాస్ చెక్ చేశాడట‌ ప్ర‌భాస్. అయితే తాను ఏఎంబీకి వ‌చ్చిన‌ట్టు ఎలాంటి హ‌డావుడి చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఫ్యాన్స్ ని అదే విష‌య‌మై రెక్వ‌స్ట్ చేశాడట. అయితే ఆ విష‌యాన్ని అభిమానులే సోష‌ల్ మీడియాలో రివీల్ చేశారు. ముందే జాగ్ర‌త్త ప‌డ్డారు కాబ‌ట్టి.. ఏఎంబీ పార్కింగ్ నుంచి లాంజ్ లోకి వ‌చ్చి ఏఎంబీ థియేట‌ర్ లోకి ప్ర‌వేశించాక కానీ ఎవ‌రికీ తెలియ‌లేదు. సినిమా వీక్షించిన త‌ర్వాత మాత్రం ప్రభాస్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీప‌డ్డారు. త‌దుప‌రి జాన్ చిత్రీక‌ర‌ణ కోసం ప్ర‌భాస్ ప్రిపేర‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

సాహో హిందీలో చ‌క్క‌ని విజయం సాధించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయి వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోక‌పోవ‌డం.. పొరుగున త‌మిళంలోనూ అనుకున్న రేంజుకు వెళ్ల‌క‌పోవ‌డం నిరాశ‌ను మిగిల్చిందని ట్రేడ్ చెబుతోంది. తొలి ప‌ది రోజుల్లో 190 కోట్లు పైగా షేర్ వ‌సూలైంద‌ని తెలుస్తోంది.