Begin typing your search above and press return to search.

ప్రభాస్ .. ఓ పవర్ఫుల్ వెపన్

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:30 PM GMT
ప్రభాస్ .. ఓ పవర్ఫుల్ వెపన్
X
ప్రభాస్ .. ఇప్పుడు ఒక పవర్ఫుల్ వెపన్ లా మారిపోయాడు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయి దిశగా పరుగులు తీయించే ఆయుధంగా మారిపోయాడు. తెలుగు సినిమా భారీతనానికి .. అది సాధించే సంచలనాలకు ఆకాశమే హద్దుగా నిరూపించే సూపర్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అందుకే భారీచిత్రాలతో బరిలోకి దిగే దర్శకనిర్మాతలకు ఆయన ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. తాను సైలెంట్ గా ఉంటూనే సక్సెస్ అంటే ఇది .. సంచలనమంటే ఇది అని నిరూపిస్తున్నాడు. సందేహం లేదు .. వచ్చే ఏడాదిలోను ఆయన ప్రభంజనమే కొనసాగుంతుందనేది అభిమానులు ఎంతో నమ్మకంతో చెబుతున్న మాట.

తెలుగు సినిమా సింగిల్ థియేటర్లను దాటుకుని మల్టీ ప్లెక్స్ లకు చేరిపోయినట్టు, ప్రభాస్ తో తెలుగు సినిమా ప్రపంచపటానికి పాకింది. మాస్ ప్రేక్షకుల హృదయాలను ఆయన మర్రి వృక్షంలా ఆక్రమించాడు. ఆయన అభిమానుల సంఖ్య మాత్రమే కాదు .. సినిమా బడ్జెట్ .. పారితోషికం కోట్లలో దూసుకెళుతోంది. ప్రభాస్ హీరోగా ఒక సినిమా ఎనౌన్స్ చేస్తే చాలు .. అందరినీ అదో మంత్రంలా ప్రభావితం చేస్తోంది. ఎక్కడ చూసినా ఆ విషయాన్ని గురించే మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ హీరోగా కొంతమంది స్టార్ డైరెక్టర్లు వరుసగా ప్రకటనలు గుప్పించారు.

ప్రభాస్ హీరోగా ఆ దర్శకనిర్మాతలు ప్రకటించిన లిస్ట్ ను ఒకసారి పరిశీలిస్తే, మరో ఐదేళ్లపాటు ప్రభాస్ డైరీ ఖాళీగా లేదనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన కెరియర్లోనే అత్యంత భారీ చిత్రంగా 'ఆది పురుష్' నిర్మితం కానుంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించనున్న యాక్షన్ మూవీ, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితం కానున్న చిత్రం కూడా ఇంచుమించు ఆ స్థాయి ఖర్చుతో రూపొందనున్నవే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'రాధేశ్యామ్' కూడా బడ్జెట్ విషయంలో తక్కువేం తినలేదు.

యూవీ క్రియేషన్స్ వారు 'రాధేశ్యామ్' సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రేమ - వెన్నెల ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయి .. కొత్తగానే అనిపిస్తాయి. అందువలన 'రాధేశ్యామ్'లో రొమాంటిక్ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించడం కోసమే కోట్లు కుమ్మరిస్తున్నారు. కథాకథనాలకు మరింత బలాన్ని జోడిస్తూ విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. భారీతనం విషయంలో ఎంతమాత్రం తగ్గని ఈ సినిమా, ప్రభాస్ అభిమానులకు ఒక పండుగలాంటిదని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో థియేటర్స్ కి రానున్న ఈ సినిమా, సంచలనానికి సరైన అర్థం చెబుతుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.