Begin typing your search above and press return to search.

గెస్ట్‌ హౌస్‌ కేసు.. ప్రభాస్‌ పై చేయి

By:  Tupaki Desk   |   2 Jan 2019 12:48 PM GMT
గెస్ట్‌ హౌస్‌ కేసు.. ప్రభాస్‌ పై చేయి
X
హైదరాబాద్‌ శివారులోని శేరిలింగంపల్లి రెవిన్యూ డివిజన్‌ లో ఉన్న ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ ను తెలంగాణ ప్రభుత్వంకు చెందిన రెవిన్యూ అధికారులు సీజ్‌ చేసిన విషయం తెల్సిందే. ప్రభుత్వ భూమిలో ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ ఉందని, అందుకే గెస్ట్‌ హౌస్‌ ను సీజ్‌ చేసినట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు. గెస్ట్‌ హౌస్‌ సీజ్‌ విషయాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగింది. పిటీషన్‌ పై నేడు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభాస్‌ తరపు లాయర్లు పై చేయి సాధించినట్లుగా తెలుస్తోంది.

పిటీషన్‌ విచారణ సమయంలో దర్మాసనం ప్రభుత్వ తరపు లాయర్‌ ను పిటీషనర్‌ ఆ భూమి రెగ్యులరైజేషన్‌ కోసం దరకాస్తు పెట్టుకున్న సమయంలో పరిశీలించి ఎందుకు వెనక్కు పంపించలేదని ప్రశ్నించారు. ఒకవేళ వెనక్కు ఆ దరకాస్తు వెనక్కు పంపిస్తే ఆ ప్రభుత్వ ఉత్తర్వు ఏది అంటూ రెవిన్యూ శాఖ తరపు లాయర్‌ ను కోర్టు ప్రశ్నించింది. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించేందుకు ఒక రోజు గడువు కావాలని ప్రభుత్వం తరపు లాయర్‌ కోరాడు.

గతంలో ప్రభాస్‌ రెగ్యులరేషన్‌ కోసం దరకాస్తు చేసుకోవడం జరిగింది. ఏదైనా అడ్డంకులు, ఇబ్బందులు ఉంటే వెంటనే తిరష్కరించాల్సి ఉంటుంది, కాని ఇంకా కూడా ప్రభాస్‌ పెట్టుకున్న దరకాస్తు రెవిన్యూ అధికారుల వద్ద పరిశీలనలో ఉంది. 2005లో ఆ భూమిని చట్ట పరిమితులకు లోబడి, అన్ని అనుమతులతో ఆ భూమిని ప్రభాస్‌ కొనుగోలు చేయడంతో పాటు చాలా సంవత్సరాలుగా పన్ను చెల్లించడంతో పాటు, కరెంటు బిల్లు మరియు ఇతరత్ర ప్రభుత్వ చెల్లింపులు చేస్తున్నట్లుగా ప్రభాస్‌ తరపున లాయర్లు చెబుతున్నారు. ఈ కేసులో అన్ని కూడా ప్రభాస్‌ కు అనుకూలంగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా కోర్టులో తీర్పు ప్రభాస్‌ కు అనుకూలంగా వస్తుందని ఆయన తరపు లాయర్లు అంటున్నారు.