Begin typing your search above and press return to search.

శ్రీవల్లికి ప్రభాస్ సపోర్టు

By:  Tupaki Desk   |   5 Sep 2017 5:51 AM GMT
శ్రీవల్లికి ప్రభాస్ సపోర్టు
X
ఏ సినిమాకైనా బలాన్ని చేకూర్చేది ఓ విధంగా స్క్రిప్ట్ అనే చెప్పాలి. రచయిత ఎంత బాగా వర్క్ చేస్తే సినిమా అంత బాగా హిట్ అవుతుంది. అలాంటి బలమైన స్క్రిప్ట్ రాసే టాప్ రచయితలలో ఒకరు కె.విజయేంద్ర ప్రసాద్. టాలీవుడ్ ఎన్నో గొప్ప చిత్రాలకు కథను అందించిన ఆయన పరభాషా ఇండుస్త్రీలకు కూడా రికార్డులను బద్దలు కొట్టే కథలను ఇచ్చారు. ముఖ్యంగా బాహుబలి కథ ఆయనకు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే బాలీవుడ్ లో కూడా బజరంగీ బాయ్ జాన్ సినిమా కథ కూడా నార్త్ లో మంచి విజయాన్ని అందించింది.

అయితే ఆయన అప్పుడప్పుడు దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తూ ఉంటారు. చివరగా 2011లో నాగార్జున - రాజన్న సినిమాని తెరకెక్కించిన విజయేంద్రప్రసాద్ ఇప్పుడు శ్రీవల్లి అనే సినిమాను తెరకెక్కించారు. సైన్టిఫిక్ త్రిల్లర్ గా వస్తున్న ఆ చిత్రంపై ప్రభాస్ కూడా తన అభిప్రాయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ.. నేను రెబల్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నపుడు విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు నాకు బాహుబలి కథని వినిపించారు. విజయేంద్ర ప్రసాద్ గారు 10 నిమిషాల్లో చెప్పిన కథ విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. రెండు మూడు గంటలవరకు ఆ ఊహల్లోనే ఉండిపోయాను. ఆయన బాలీవుడ్ లో కూడా బజరంగి భాయీజాన్ లాంటి కథను అందించి బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదలైన వారానికే బజరంగీ భాయీజాన్ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకుందని ప్రభాస్ చెప్పాడు.

ఇక శ్రీవల్లి సినిమా గురించి మాట్లాడుతూ.. మంచి రచయిత పేరు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగాను శ్రీవల్లి సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని చిత్ర యూనిట్ కి కూడా విషెస్ ని అందించారు. ఇక శ్రీవల్లి సినిమా చాలా రోజుల క్రితేమే పూర్తయ్యింది. మరి ఆ సినిమా విడుదల ఎందుకు ఆలస్యం అయ్యిందనేది ఇంకా అధికారికంగా తెలియలేదు. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ -మళయాలం బాషలలో కూడా త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారట చిత్ర నిర్మాతలు.