Begin typing your search above and press return to search.

బాలయ్యతో ప్రభాస్.. ఆ చొక్కా ధర ఎంతంటే?

By:  Tupaki Desk   |   13 Dec 2022 3:30 AM GMT
బాలయ్యతో ప్రభాస్.. ఆ చొక్కా ధర ఎంతంటే?
X
నందమూరి బాలకృష్ణ ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక స్టార్ హీరో టాక్ షోలో పాల్గొంటూ ఉండడంతో ఈ షోలో అతను ఎలాంటి విషయాలపై స్పందిస్తాడు అనేది ఎంతో హైలెట్ గా మారబోతోంది.

అంతేకాకుండా ప్రభాస్ జీవితంలోని ఎన్నో కోణాలను బాలయ్య బాబు అందరికీ తెలియజేయబోతున్నాడు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ప్రభాస్ ఏ విధంగా స్పందించి ఉంటాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే ప్రభాస్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ అయితే మొత్తం పూర్తయింది. హీరో గోపీచంద్ కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్కు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు.

అందులో ప్రభాస్ స్మార్ట్ లుక్ తో కనిపిస్తున్నాడు. ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్ళీ ఇలాంటి లుక్ తో అయితే కనిపించలేదు. సాహో రాధే శ్యామ్ రెండు సినిమాల్లో కూడా అతని లుక్కు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ షో లో వేసుకున్న చొక్కాపై కూడా అందరి ఫోకస్ పడింది. ఇక చొక్కా ధర గురించి కూడా ఇప్పుడు అనేక రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి.

అది పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్ అని తెలుస్తోంది. దీని ధర 115 పౌండ్స్. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 11,618/- ఉంటుందట. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో అయితే ఫ్యాన్స్ ఎక్కువగా ఆ షర్ట్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు.

ఇక రేటు చూసిన తర్వాత అయితే కొందరు షాక్ అవుతున్నారు. అలాగే వాటికి సంబంధించిన డూప్లికేట్స్ షర్ట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఎలాంటి షర్ట్ వేసుకున్నా కూడా వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించాడు. ఇక ఫుల్ ఎపిసోడ్లో బాలయ్య బాబు ప్రభాస్ మధ్యలో ఎలాంటి విషయాలు పై చర్చలు జరిగి ఉంటాయో ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.