Begin typing your search above and press return to search.

రోజుకు 16 గంటలు.. బాహుబలి కష్టాలు

By:  Tupaki Desk   |   16 Aug 2016 10:30 PM GMT
రోజుకు 16 గంటలు.. బాహుబలి కష్టాలు
X
బాహుబలి ప్రాజెక్టు కోసం.. ప్రభాస్ ఇప్పటికి మూడేళ్లకు పైగా టైమ్ కేటాయించాడు. మొదటి భాగం రిలీజ్ అయ్యి ఏడాది పైగానే పూర్తి కాగా.. దానికి ముందు రెండున్నరేళ్ల కష్టం ఉంది. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ కు.. క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇది పూర్తయ్యే వరకూ.. ప్రధాన నటులు అదే లుక్ ను మెయింటెయిన్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా బాహుబలిగా నటిస్తున్న ప్రభాస్.. తన లుక్స్ లో వీసమెత్తు కూడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మొదటి భాగంలో ఎక్కువగా శివుడు పాత్రమీదే కథ నడిచినా.. సెకండ్ పార్ట్ లో దాదాపు బాహుబలి స్టోరీనే ఉంటుంది. పైగా ఈ పాత్ర కోసం ఇప్పటికే 20 కిలోల బరువు పెరిగాడు ప్రభాస్. అలా బరువు పెరిగి కూడా.. పూర్తి స్థాయి ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేయాలి. అందుకే షూటింగ్.. వర్కవుట్స్ మొత్తం కలిపి 16 గంటల పాటు కష్టపడుతూనే ఉన్నాడట ప్రభాస్. అటు లుక్స్ లోను.. ఇటు దేహధారుడ్యంలోను ఒకేతీరుగా ఉండేందుకే ఇలా కష్టపడాల్సి వస్తోంది.

బాహుబలి రిలీజ్ తర్వాత.. ప్రభాస్ రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా నేషనల్ కం ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు. తన రేంజ్ ను నిలబెట్టుకోవాలన్నా మరింతగా పెంచుకోవాలన్నా.. బాహబలి ది కంక్లూజన్ ను మొదటి భాగం పెద్ద హిట్ గా నిలిపే వరకూ కష్టపడాల్సి ఉందని ముందే తెలిసిన ప్రభాస్.. అందుకోసం ఎలాంటి లూప్ హోల్స్ వదలబోవడం లేదని.. ఈ 16 గంటల కష్టం చూస్తే అర్ధమవుతోంది కదూ.