Begin typing your search above and press return to search.
దసరా రేస్ నుంచి ప్రభాస్ సినిమా అవుట్?
By: Tupaki Desk | 12 April 2020 7:26 AM GMTడార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమాను ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే #ప్రభాస్20 అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమని అంటున్నారు. దీనికి ఒక ముఖ్య కారణం జార్జియా షెడ్యూల్.
ఈ సినిమా ఒక పీరియడ్ లవ్ స్టోరీ. సినిమాలో చాలా భాగం విదేశాల నేపథ్యంలో సాగుతుంది. అందుకే జార్జియాలో ఒక లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేశారట. కానీ కరోనా వైరస్ ప్రభావం కారణంగా దాదాపుగా చాలా దేశాలు లాక్ డౌన్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్ లేదు. ఇండియాలో కూడా ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయం ప్రకటించారు. ఈ కరోనా..లాక్ డౌన్ పుణ్యమా అని #ప్రభాస్20 జార్జియా షెడ్యూల్ రద్దు చేయాల్సివచ్చిందట. ఈ షెడ్యూల్ పూర్తయితే కానీ #ప్రభాస్20 షూటింగ్ ఒక కొలిక్కిరాదట.
ఏప్రిల్ 30 తర్వాత అయినా లాక్ డౌన్ విరమణ ప్రకటిస్తారా? ఇతర దేశాలకు ప్రయాణం చేయవచ్చా అనే దానిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. కొందరేమో జూన్ వరకూ ఈ పరిస్థితి సద్దు మణగదు అని గట్టిగా చెప్తున్నారు. అందుకే ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు దాదాపుగా లేవని అంటున్నారు. లాక్ డౌన్ విరమణ తర్వాతే ఈ సినిమా జార్జియా షెడ్యూల్ విషయంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది క్లారిటీ రావొచ్చని అప్పటివరకూ ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుందని అంటున్నారు.