Begin typing your search above and press return to search.
ప్రభాస్ 21 .. సైన్స్ ఫిక్షన్.. 200 కోట్ల బడ్జెట్
By: Tupaki Desk | 1 March 2020 4:10 AM GMTడార్లింగ్ ప్రభాస్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించనున్నారా? ఈసారి ``బాహుబలి- సాహో``ని మించిన ప్రయోగానికి సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే తాజా సమాచారం. ప్రభాస్ 20 ప్రేమకథా చిత్రం. కానీ ప్రభాస్ 21 పూర్తి డిఫరెంట్ మూవీ అని తెలుస్తోంది. మరింత డీప్ గా వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న జాన్ (ప్రభాస్ 20) ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ పాన్ ఇండియా కేటగిరీలోనే తెరకెక్కిస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత డార్లింగ్ బడ్జెట్లు కాస్త తగ్గే ఛాన్సుందని భావించినా.. మరో భారీ ప్రయోగానికే శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ లేటెస్టుగా వైజయంతి మూవీస్ లో భారీ చిత్రానికి కమిటైన సంగతి తెలిసిందే. మహానటి ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన లీకులు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్లో దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా ప్రభాస్ 21 డీటెయిల్స్ అందించారు. ఈసారి ప్రభాస్ ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశమే అయినా రియలిస్టిక్ గా ఉంటుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయనున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు. ``ఈ స్క్రిప్ట్ ప్రభాస్ కి బాగా నచ్చింది. అతడిని కన్విన్స్ చేయడం కష్టమేమీ అనిపించలేదు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కోసమే 10నెలలు పని చేయాల్సి ఉంది. కథానాయిక ఎవరు? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. చిత్రీకరణకు ముందు నటీనటుల వివరాల్ని వెల్లడిస్తాం`` అని వెల్లడించారు. బాహుబలి జోనర్ తో పోలిస్తే సాహో జోనర్ డిఫరెంట్. వాస్తవానికి ఫిక్షన్ జోడించిన చిత్రాలివి. ఇక జాన్ పూర్తిగా క్లాసిక్ డేస్ అట్మాస్పియర్ లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం. వీటితో పోలిస్తే ప్రభాస్ 21 పూర్తిగా వైవిధ్యమైనది. సైన్స్ ఫిక్షన్ కథాంశం అంటే ఒక కోయీ మిల్ గయా తరహాలో భారీ ప్రయోగమేనని అభిమానులు భావిస్తున్నారు.