Begin typing your search above and press return to search.

విలన్ అవతారంలో డ్యాన్సింగ్ డాన్

By:  Tupaki Desk   |   17 Sep 2017 6:13 AM GMT
విలన్ అవతారంలో డ్యాన్సింగ్ డాన్
X
మన దేశంలో డ్యాన్సులకు సంబంధించినంతవరకూ డాన్ అనే బిరుదు ప్రభుదేవాకు మాత్రమే సొంతం. దేశంలో డ్యాన్స్ లకు ఆస్థాయిలో క్రేజ్ తీసుకొచ్చేశాడు. కొరియోగ్రాఫర్ గా.. హీరోగా.. కేరక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా కూడా తన ట్యాలెంట్ చూపించేశాడు. డైరెక్టర్ గా మారిన తర్వాత యాక్టింగ్ పై ప్రభుదేవా ఫోకస్ తగ్గించిన మాట వాస్తవమే.

దాదాపు 8 ఏళ్ల పాటు తమిళ్ సినిమాలో నటించని ప్రభుదేవా గతేడాది అభినేత్రి [తమిళ్ లో Devi(l)] అంటూ ఓ సినిమాలో హీరోగా నటించాడు. అక్కడి నుంచి మళ్లీ నటుడిగాను సత్తా చాటేందుకు ప్రభుదేవా ఫిక్స్ అవగా.. వరుసగా సినిమాలకు ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఓ ప్రయోగాత్మక చిత్రంలో ప్రభుదేవా నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మెర్క్యురీ అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం.. థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని ఇఫ్పటికే చెప్పేశారు. ఈ సినిమాలో అసలు మాటలే ఉండకపోవడం స్పెషాలిటీ.

ఈ ఎక్స్ పెరిమెంటల్ మూవీలో.. ప్రభుదేవా నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడట. నెగిటివ్ రోల్ అంటే అదేమీ చిన్నా చితకా పాత్ర కాదు.. ఏకంగా లీడ్ విలన్ పాత్రలోనే ప్రభుదేవా కనిపించనున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయిపోయాయని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. డ్యాన్సులతో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీ పండించే ప్రభుదేవాను తొలిసారిగా విలన్ పాత్రలో చూపించాలనే థాట్.. వెరైటీనే అని చెప్పాలి.