Begin typing your search above and press return to search.
పెళ్ళాం రెండోసారి ఊరెళుతోంది
By: Tupaki Desk | 17 Jan 2019 5:30 PM GMT2003లో శ్రీకాంత్-వేణుల కాంబినేషన్ లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే సినిమా గుర్తుందిగా. హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ మూవీ వసూళ్ల పరంగా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అది ఒక తమిళ రీమేక్. చార్లీ చాప్లిన్ పేరుతో ప్రభుదేవా-ప్రభుల కాంబోలో వచ్చిన ఒరిజినల్ వెర్షన్ కు దర్శకుడు శక్తి చిదంబరం. ఇప్పుడు మళ్ళి ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ రూపొందింది. అదే పేరుతో చార్లీ చాప్లిన్ 2గా వస్తున్న ఈ మూవీ జనవరి 25న విడుదల కానుంది.
హీరోలు వాళ్లే రిపీట్ అవుతున్నారు. హీరోయిన్లను మాత్రం వయసు రిత్యా మార్చేసారు. నిక్కీ గిల్రాని-అదా శర్మ కొత్త వెర్షన్ లో కనిపిస్తారు. ఆమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మీద కోలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లాగే ఇది కూడా నవ్వుల్లో ముంచెత్తుతుందని ఆశిస్తున్నారు. అయితే ఇది హిట్ అయితే తెలుగులో వచ్చే ఛాన్స్ ఉంది. పెళ్ళాం ఊరెళితేలో నటించిన శ్రీకాంత్ ఎలాగూ యాక్టివ్ గా ఉన్నాడు. వేణు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా రమ్మంటే కాదనే రకం కాదు.
ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం మానేసినా ఓ ట్రయిల్ అయితే వేయొచ్చు. ఆయన కాదన్నా యూత్ టాలెంట్ పుష్కలంగా ఉంది కాబట్టి నో ప్రాబ్లెమ్. కానీ చార్లీ చాప్లిన్ హిట్ అయితేనే ఇది వస్తుంది. అందుకే దీని మీద మనవాళ్ళు ఓ కన్నేసి ఉంచారు. బాహుబలి తప్ప ఇప్పటిదాకా ఏ సీక్వెల్ సౌత్ లో వర్క్ అవుట్ అయిన దాఖలాలు లేవు. ఆఖరికి 2.0 కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఈ నేపథ్యంలో కామెడీని నమ్ముకుని వస్తున్న ఈ మూవీకి ఎలాంటి స్పందన దక్కుతుందో వేచి చూడాలి.