Begin typing your search above and press return to search.

ప్రభుదేవాకు కొత్త లవర్‌ దొరికిందా?

By:  Tupaki Desk   |   19 March 2015 1:30 AM GMT
ప్రభుదేవాకు కొత్త లవర్‌ దొరికిందా?
X
ఇక్కడ మాట్లాడుతోంది తెలుగమ్మాయి తేజస్వి కాదు. కన్నడ హీరోయిన్‌ తేజస్విని గురించి. ఈ అమ్మాయికి, డ్యాన్స్‌ మాస్టర్‌ టర్నడ్‌ డైరెక్టర్‌ ప్రభుదేవాకు లింకేంటో జనాలకు అస్సలర్థం కావడం లేదు. నయనతారతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిన తర్వాత ముంబయిలో సెటిలైపోయి హిందీ సినిమాలు తీసుకుంటున్న ప్రభుదేవా.. ఈ మధ్య చెన్నైకి వచ్చినపుడు తనకు అత్యంత ప్తులైన దర్శకులు, నటులను ఆహ్వానించారు. ఆ పార్టీలో హీరోయిన్‌ తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తేజస్వినితో ప్రభుదేవా ఏ సినిమాకూ పని చేయలేదు. మరి వాళ్ల మధ్య ఎప్పుడు బంధం మొదలైందో కానీ.. ప్రభుదేవా మాత్రం పార్టీకి వచ్చిన వాళ్లందరికీ తేజస్వినిని ప్రత్యేకంగా పరిచయం చేశాడు.

నయనతారతో బంధం తెగిపోయిన ఏడాదికి ప్రభుదేవాకు తేజస్విని పరిచయమై తక్కువ సమయంలో అతడికి దగ్గరైందట. ఇద్దరూ తరచుగా ముంబయిలో, బెంగళూరులో కలిసేవాళ్లని సమాచారం. ఐతే ఎక్కడా వ్యవహారం బయటికి పొక్కకుండా చూసుకున్నారు కానీ.. ఈ పార్టీతో వ్యవహారం బట్టబయలైపోయింది. ఈ పార్టీ తర్వాత ప్రభుదేవాతో లింకేంటి అని తేజస్వినిని అడిగితే.. తనకు ప్రభుదేవా ఎప్పట్నుంచో తెలుసని.. అతడితో ఎప్పుడూ టఛ్‌లో ఉంటానని మొహమాటం లేకుండా చెప్పేసింది. ప్రభుదేవా బాలీవుడ్‌లో ఏమైనా అవకాశాలు ఇప్పిస్తున్నారా అని అడగ్గా.. తమ పరిచయం దేన్నీ ఆశించి ఏర్పడలేదంటూ భారీ డైలాగ్‌ వేసింది తేజస్విని.