Begin typing your search above and press return to search.
ప్రభుదేవా ఇక మెగా ఫోన్ పట్టడట!
By: Tupaki Desk | 22 Sep 2021 3:31 AM GMTవెండితెరపై ఎప్పటికప్పుడు హీరోల డాన్సులు మారుతూ వచ్చాయి. తెలుగు .. తమిళ సినిమాలలో కొరియోగ్రఫీ పరంగా చూసుకుంటే ప్రభుదేవాకు ముందు .. ఆ తరువాత అనే చెప్పుకోవాలి. ప్రభుదేవా తన డాన్సులతో అంతగా ప్రభావితం చేశాడు. తెరపై డాన్సులతో ఆయన ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు .. తన రాకతో ఒక నూతన శకాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ చూసి కుర్రాళ్లు క్లాప్స్ కొట్టకుండా .. విజిల్స్ కొట్టకుండా ఉండలేకపోయారు. హీరోలు తమ సినిమాలకు ప్రభుదేవానే డాన్స్ కంపోజ్ చేయాలని పట్టుబట్టారు.
అలా ప్రభుదేవా ఒక ఉప్పెనలా ఉద్ధృతిగా వచ్చేశాడు. కొరియోగ్రాఫర్ గా ఒక స్టార్ హీరో స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఆ తరువాత సరదాగా తెరపై ఒక పాటలో మెరవడం మొదలుపెట్టాడు. అలా మెల్లగా హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. హీరో అయిన తరువాత మిగతా హీరోలకు కొరియోగ్రఫీని అందించేంత తీరిక లేకుండా ఆయన దూసుకుపోయాడు. ఆ తరువాత ఓ శుభముహూర్తాన ఆయన మెగా ఫోన్ పట్టేశాడు. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా?' సినిమాతో దర్శకుడిగా ఆయన తన సత్తా చాటుకున్నాడు.
ఇక 'పౌర్ణమి' సినిమా విడుదలైన సమయంతో పాటు మరికొన్ని కారణాల వలన సరిగ్గా ఆడలేదు గానీ, ఇప్పటీకీ టీవీల్లో మంచి రేటింగును రాబడుతోంది. ఈ సినిమా తరువాత దర్శకుడిగా ప్రభుదేవా తన మకామును బాలీవుడ్ కి మార్చేశాడు. తన తెలివి తేటలతో స్టార్ హీరోలను ఒప్పిస్తూ వాళ్లతో రీమేకులు చేస్తూ వెళ్లాడు. ఆ సినిమాల్లో కొన్ని భారీ విజయాలను సాధిస్తే, మరొకొన్ని పరాజయం పాలయ్యాయి. దర్శకుడిగా జాతీయస్థాయిలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఆ తరువాత భూమి గుండ్రంగా ఉంటుందనే విషయాన్ని నిజం చేస్తూ తిరిగి చెన్నైకి చేరుకున్నాడు. హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళుతున్నాడు. దర్శకుడిగా అవకాశాలు వస్తున్నప్పటికీ చేయనని చెప్పేస్తున్నాడట. ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా నటుడిగా మాత్రమే కొనసాగాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో వాస్తవమెంతనేది అలా ఉంచితే, కొరియోగ్రఫర్ గా .. నటుడిగా .. దర్శకుడిగా సక్సెస్ అయిన అరుదైన ఘనత ప్రభుదేవా ఖాతాలో కనిపిస్తుంది.