Begin typing your search above and press return to search.
ఇండియన్ జాక్సన్ అంతగా మారిపోయాడా!!
By: Tupaki Desk | 12 July 2016 4:55 AM GMTఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలిపించుకున్న ప్రభుదేవా.. ఈ మధ్య డైరెక్షన్ లో బాగా బిజీగా ఉన్నాడు. కొన్ని టాలీవుడ్ హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ భారీ హిట్స్ నే కొట్టాడు. సొంత స్టోరీలను హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలున్నా.. రీమేక్స్ విషయంలో మాత్రం ప్రభుదేవా కింగ్. గతేడాది ఏబీసీడీ2 తర్వాత ఈ డ్యాన్సింగ్ స్టార్ ఆన్ స్క్రీన్ పై అభినేత్రిలో కనిపించబోతున్నాడు.
తెలుగులో అభినేత్రి.. తమిళ్ లో డెవి(ల్) అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం హిందీలో కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోంది. ఇన్నేళ్లూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క అనే టైపులో స్క్రీన్ పై కనిపించబోతున్నాడట ప్రభుదేవా. 'ఇన్నేళ్ల పాటు కర్లింగ్ హెయిర్ తోనే కనిపించిన నేను.. తొలిసారిగా స్ట్రైట్ హెయిర్ తో కేజువల్ గా కనిపిస్తాను. ఈ మేకోవర్ నాకు బాగా నచ్చింది. మొదటి సారిగా ఈ కొత్త హెయిర్ కట్ తో చూసుకున్నపుడు నన్ను నేనే గుర్తు పట్టలేకపోయాను' అని చెబుతున్నాడు ప్రభుదేవా.
చాలాకాలం తర్వాత డైరెక్టర్ గా బ్రేక్ తీసుకుని యాక్టింగ్ చేస్తుండడంతో హ్యాపీగా ఉందన్న ప్రభుదేవా.. తాను ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా ఉంటూ.. రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేస్తున్నానని అంటున్నాడు. అంతే కాదు.. లీడ్ కేరక్టర్స్ మినహాయిస్తే.. మిగిలిన యాక్టర్స్ అంతా మారిపోతారని.. అందుకే ఏ భాషలో కూడా డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి రాదని చెప్పాడు ఈ డ్యాన్సర్ కం కొరియోగ్రాఫర్ కం యాక్టర్ కం డైరెక్టర్ ప్రభుదేవా.