Begin typing your search above and press return to search.
నా చేతులు ఉన్నాయనే మాట సరికాదు
By: Tupaki Desk | 26 Sep 2016 7:30 PM GMTఇండియాకి సంబంధించిన వరకూ.. డ్యాన్సింగ్ గాడ్ అంటే ప్రభుదేవానే. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు ప్రభుదేవా కొరియోగ్రఫీ.. డైరెక్షన్ తో పాటు అడపాదడపా యాక్టింగ్ కూడా చేసేస్తుంటాడు. చాలా కాలం తర్వాత ఈ హీరో కం డైరెక్టర్ యాక్ట్ చేసిన ఓ తెలుగు మూవీ 'అభినేత్రి' రిలీజ్ కి రెడీ అయింది. మొదట ఈ పాత్రలో వేరే స్టార్ నటించాల్సి ఉండగా.. అతను తప్పుకోవడంతోనే తనకీ అవకాశం వచ్చిందంటున్నాడు ప్రభుదేవా.
'అభినేత్రి ఓ హారర్ కామెడీ మూవీ. ఇందులో నేను తమన్నా భర్తగా కనిపిస్తాను. నా రోల్ చాలా జోవియల్ గా ఉటుంది. ఈ సినిమా డ్యాన్స్ ఒక భాగం. తమన్నా ఎంతో కష్టపడి.. తన మనసు-తనువు అన్నిటినీ కష్టపెట్టి మరీ ఈ పాత్రలో మెప్పించింది. ఇక ఈ మూవీ డైరెక్షన్ విషయంలో నా చేతులు ఉన్నాయనే మాట సరికాదు. డైరెక్ట్ చేసేటప్పుడు కొరియోగ్రఫీ పట్టించుకోను.. అలాగే యాక్ట్ చేసేటప్పుడు వేరేవాటి జోలికెళ్లను' అంటున్న ప్రభుదేవా.. తనకు కొరియోగ్రఫీనే అన్నిటికంటే ఇష్టం అని చెప్పేశాడు.
ఈ సినిమా కోసం సోనూ సూద్ ను ఒక పాటలో కొరియోగ్రాఫ్ చేసిన ప్రభుదేవా.. అలాగే తమన్నాతో కూడా ఒక బీభత్సమైన డ్యాన్స్ నంబర్ చేయించాడు. ఈ రెండు పాటల టీజర్లే ప్రభు చేసే కొరియోగ్రాఫీ రేంజేంటో చెప్పేస్తున్నాయి.