Begin typing your search above and press return to search.
బాహుబలి కోటలో మరో సినిమా షూటింగ్
By: Tupaki Desk | 31 July 2017 4:22 AM GMTతెలుగులో జానపద సినిమాలు పూర్తిగా రావటం మానేశాయ్ అనుకున్న సమయంలో రాజమౌళి బాహుబలి రూపంలో సినిమా చరిత్రలోనే కలకాలం గుర్తుండిపోయే సినిమా తీశాడు. ఈ సినిమా లో మాహిష్మతి రాజ్యం కోసం పెద్ద సెట్ కూడా వేసిన సంగతి మనకు తెలిసిందే. బాహుబలి సినిమాలో కోసం నిర్మించిన ఆ సెట్లో ఇప్పుడు మరో సినిమా షూటింగ్ చేయబోతుంది.
‘గులేబకావళి’ అనే ఒక సినిమా ఇప్పుడు బాహుబలి సెట్ లో కొంత షూటింగ్ జరుపుకోబోతుంది. ఈ గులేబకావళి సినిమాలో హీరోగా ప్రభుదేవా హీరోగా హన్సిక హీరోయిన్ గా నటిస్తున్నారు. వైభవంగా కనిపించే దుస్తులు గొప్పగా కనిపించే కోటలు కావలిసి వచ్చింది అంటా ఈ సినిమా కోసం. బాహుబలి సినిమాలో కోటలోని గదులు గాని ఆ సినిమాలో దుస్తులు కానీ ఎంత ఠీవి గా ఉన్నాయో మనం చూశాం. ఇప్పుడు వాటిని మళ్ళీ కొంచెం మార్పులు చేసి ఈ గులేబకావళి లో వాడే పని చేయబోతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాహుబలి స్థాయిలో తీయడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం ఒక 10-15 నిముషాలైన బాహుబలిలా అనిపించినా మా సినిమా విజయం పొందినట్లే అని చెబుతున్నాడు.” ఈ సినిమాకు రాజసం ఉట్టిపడే దుస్తులు అవసరం అందుకే ఇక్కడ షూటింగ్ చేయడానికి కారణం. పైగా ఈ సినిమా కోసం కనీసం మూడు నెలలు స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కోసం వెచ్చిస్తున్నాం. ఎందుకంటే ప్రేక్షకులు కనీసం నమ్మశక్యం గా అనిపించాలి కదా అంటున్నాడు ప్రభుదేవా.
ఇంకా ప్రభుదేవా రాజమౌళి గురించి మాట్లాడుతూ “నాకు రాజమౌళి కొన్నేళ్లుగా తెలుసు నాకు అతను మంచి ఫ్రెండ్ . ఎప్పుడూ కొత్తవి చేయడానికి ముందుంటాడు. నాకు అతనే మార్గదర్శకుడు'' అని అన్నాడు. రాజమౌళి విక్రమార్కుడు సినిమాను హింది లో నేను రౌడీ రాథోడ్ గా తీశాను. ముందు ముందు కూడా అతనితో పని చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పాడులే.