Begin typing your search above and press return to search.

యాంకర్ ప్రదీప్ నిరాశకు అదే కారణమా..?

By:  Tupaki Desk   |   28 March 2020 12:30 AM GMT
యాంకర్ ప్రదీప్ నిరాశకు అదే కారణమా..?
X
టాలీవుడ్ లో యంగ్ హీరోలతో పాటు సేమ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్. దాదాపు పదేళ్లకు పైగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న ప్రదీప్ లక్షలాది అభిమానులను సంపాదించుకున్నాడు. బుల్లితెర పై ఎన్నో షోలతో బిజీగా ఉంటూనే అడపాదడపా సినిమాలలో కన్పిస్తుంటాడు. అయితే రీసెంట్ గా ప్రదీప్ హీరోగా మారాడు. ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం "30రోజులలో ప్రేమించడం ఎలా?". ఈ నెలలో విడుదలకు సిద్దమైన ఈ సినిమా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాకోసం ప్రదీప్ ఎంతో కష్టపడ్డాడట. ఇప్పటికే ఈ సినిమా పాటలు సోషల్ మీడియా లో అద్భుతమైన బజ్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా ప్రదీప్ సినిమా పై భారీ ఆశలనే పెట్టుకున్నాడు. కానీ సడన్ గా కరోనా విజృంభించడంతో రిలీజ్ సినిమాలు అన్నింటికీ బ్రేక్ పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా రిలీజ్ కి నోచుకోక పోవడంతో ప్రదీప్ చాలా నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. అయినా ప్రదీప్ ఇప్పటికే సినిమా హీరోగా రావడానికి చాలా ఆలస్యం చేసాడని టీవీ అభిమానులు అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి ప్రదీప్ తన సినిమా గురించి ఏదైనా కొత్త వార్త చెప్తాడేమో..