Begin typing your search above and press return to search.

ఆ సెలబ్రిటీ హీరో అవుతాడా? ఫెయిల్యూర్ గా మిగిలిపోతాడా?

By:  Tupaki Desk   |   20 April 2020 10:30 PM GMT
ఆ సెలబ్రిటీ హీరో అవుతాడా? ఫెయిల్యూర్ గా మిగిలిపోతాడా?
X
మన తెలుగు సినీ అభిమానులు సినిమా హీరోలను టీవీలో చూడ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు. కానీ టీవీల్లో ఫేమస్ అయిన సెల‌బ్రెటీలు హీరోలుగా మారితే మాత్రం అసలు ఆదరించట్లేదు. టీవీ సెలబ్రిటీలే కాదు కమెడియన్ల విషయంలో కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర పై జ‌బ‌ర్ధ‌స్త్ గ్యాంగ్ లో ఉన్న చాలా మంది టీవీ క‌మీడియ‌న్లు సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే టీవీ యాంక‌ర్లు కూడా హీరోలుగా వస్తూ వెళ్లిపోతున్నారు. అయితే ఒకసారి హీరోలుగా మారిన టీవీ సెల‌బ్రిటీలు హీరోలుగా ఆదరణ లేక సొంత వృత్తిలో కూడా నిలబడలేక పోతున్నారు. హీరోలుగా టీవీసెలబ్రిటీలుగా ఎందులోనూ రాణించ‌లేక బంగారం లాంటి కెరీర్ ని దుర్భ‌రం చేసుకుంటున్నారు.

గతంలో హీరోగా ట్రై చేసిన టీవీ యాంకర్ ర‌వి కెరీర్ ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే సుడిగాలి సుధీర్ అండ్ కో వ‌రుస‌పెట్టి సినిమాలు తీసి పెట్టుబ‌డి పెట్టిన వాళ్ల‌కి అప్పులు, వడ్డిల్లో షేర్ ఇచ్చారట. ఇక తాజాగా టీవీ సెలబ్రిటీ, స్టార్ యాంక‌ర్ ప్ర‌దీప్ కూడా హీరోగా రాబోతున్నాడు. క‌రోనా రాక‌పోయి ఉంటే ప్రదీప్ కూడా హీరోగా స‌క్సెస్ అయ్యాడో లేదో తెలిసిపోయేది. ఇప్ప‌డు లాక్ డౌన్ కారణంగా ప్రదీప్ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియని డైలామాలో ఉన్నారు. ఒకవేళ ఆన్ లైన్ లో రిలీజ్ చేద్దామంటే.. ప్రేక్షకులు ఏదో షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసాడని అనుకుంటారు. థియేట‌ర్లో రిలీజ్ చేస్తే టీవీల్లో యాంకర్ గా ఆదిరించిన ఆడియెన్స్ టికెట్స్ కొంటారో లేదో తెలియ‌ని ప‌రిస్థితి. లాక్ డౌన్ వ‌ల్ల వ‌చ్చిన భారీ గ్యాప్ వ‌ల్ల ప్రదీప్ కి హామీ ఇచ్చినవారి మైండ్ సెట్ కూడా మారే అవ‌కాశం ఉంది. సో ప‌ద్రీప్ ఫెయిల్యూర్ బ్యాచ్ లో చేర‌తాడో లేక సినిమా హీరోల బ్యాచ్ లో చేరతాడో చూడాలంటే.. కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..!