Begin typing your search above and press return to search.

ప్రదీప్‌..నీ సోది పెళ్లి చూపులు ఆపేయ్‌ బాబు

By:  Tupaki Desk   |   6 Oct 2018 7:42 AM GMT
ప్రదీప్‌..నీ సోది పెళ్లి చూపులు ఆపేయ్‌ బాబు
X
తెలుగు మెయిల్‌ యాంకర్స్‌ లో ప్రదీప్‌ ను మించిన యాంకర్‌ లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతడు ఏ షోను చేసినా - ఏ కార్యక్రమంకు వ్యాఖ్యాతగా వ్యవహరించినా కూడా చాలా పద్దతిగా - ఫన్‌ గా - ఆరోగ్యకరమైన వాతావరణంలో షో నడిచేలా చేస్తాడు. అందుకే ప్రదీప్‌ అంటే అన్ని రకాల ప్రేక్షకులకు చాలా అభిమానం ఏర్పడినది. ముఖ్యంగా అమ్మాయిలు ప్రదీప్‌ అంటే పడి చచ్చేలా తయారు అయ్యారు. ఇంతటి అభిమానం దక్కించుకున్న ప్రదీప్‌ పెళ్లి చేసుకునేందుకు ‘పెళ్లి చూపులు’కు రెడీ అయ్యాడు.

ప్రస్తుతం ప్రదీప్‌ పెళ్లి చూపులు స్టార్‌ మాటీవీలో జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రదీప్‌ పై అభిమానం ఉన్న వారు పెళ్లి చూపులు ఆడిషన్స్‌ కు హాజరు కావచ్చు అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఆ ధరకాస్తుల్లోంచి 14 మందిని ఎంపిక చేసి ప్రదీప్‌ తో ట్రావెల్‌ అయ్యేలా షోను డిజైన్‌ చేశారు. ఈ షో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రోలింగ్‌ కు గురవుతుంది. ప్రదీప్‌ పై అభిమానం ఉన్న వారు కూడా ఈ షోను ఆధరించడం లేదు. సుమ యాంకర్‌ గా వ్యవహరిస్తున్న ఈ షోలో 14 మంది అమ్మాయిలు ప్రదీప్‌ ను ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇదో సుదీర్ఘ ప్రాసెస్‌ ల జరుగుతుంది. ప్రదీప్‌ పై అభిమానంతో ఈ 14 మంది అతడిని వివాహం చేసుకోవాలనే కోరికతో షోలో పాల్గొంటున్నారు. అయితే ప్రదీప్‌ వీరిలో ఒకరిని పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం మాత్రం ఎవరికి లేదు.

ఈ షో ఆద్యంతం చాలా బోరింగ్‌ గా, సోది అన్నట్లుగా సాగుతుంది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 పూర్తి అవ్వగానే హమ్మయ్య పీడ విరగడ అయ్యింది అంటూ అంతా సంబరం వ్యక్తం చేశారు. కాని ఆ వెంటనే ‘పెళ్లి చూపులు’ అంటూ ప్రదీప్‌ ప్రేక్షకుల నెత్తిన గుండు పెట్టాడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. పెళ్లి చూపులు షో గురించి రకరకాలుగా ఊహించుకున్నారు. కాని ఏమాత్రం ఆసక్తికరంగా, నేచురల్‌ గా లేకుండా షో సాగుతున్న కారణంగా ప్రేక్షకులు విసుగు చెందుతున్నారు. ఎలాగూ ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిని ప్రదీప్‌ పెళ్లి చేసుకోడు కనుక షోను వెంటనే ఆపేయాల్సిందిగా డిమాండ్‌ వినిపిస్తుంది.

ఒక వేళ ఆ 14 మందిలో ఒక అమ్మాయిని ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటే మిగిలిన 13 మంది పరిస్థితి ఏంటీ? వారు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటీ - వారు భర్తలతో సంతోషంగా ఉండగలరా అంటూ రకరకాలుగా ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రదీప్‌ ఈమద్య కాలంలో చేసిన, చేస్తున్న అతి చెత్త - సోది కార్యక్రమం ‘పెళ్లి చూపులు’ అంటూ ఆయన అభిమానులు స్వయంగా అంటున్నారు. గతంలోనే ఇలాంటి సెలబ్రెటీ స్వయంవరం టీవీ షోలు ఫ్లాప్‌ అయ్యాయి. మరోసారి అదే విధంగా ప్రదీప్‌ ఎలా ప్రయత్నిస్తున్నాడో అర్థం కావడం లేదు.