Begin typing your search above and press return to search.
మహర్షి ప్రేమ ఫలించేదే.. కానీ
By: Tupaki Desk | 9 Jan 2016 5:51 AM GMTఓ సినిమాకి ఎడిటింగ్ చేసే మేలు ఎంతో తెలుసుకోడానికి ఇదో చక్కటి నిదర్శనం. ఈ మధ్య కాలంలో స్పూఫ్ లు సినిమాలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిసిందే. చివరికి స్టార్ హీరో సినిమా అయినా ఈ ఇమిటేషన్ డ్రామా ఉండాల్సిందే అన్నంతవరకూ వచ్చింది. ఉన్నా పర్లేదు కానీ దాన్ని ఎంతవరకు పండించాలన్న విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి. ఈ విషయంలో రామ్ అదృష్టవంతుడే. విషయానికొస్తే...
రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన నేను శైలజ సినిమాలో రౌడీగా కామెడి పండించాడు సీనియర్ విలన్ ప్రదీప్ రావత్. ఈ మార్పును ప్రేక్షకులూ పాజిటివ్ గానే తీసుకున్నారు. దాంతో మహర్షి పాత్ర పండింది. అయితే అతని ప్రేమ కథ మాత్రం సుఖాంతం కాలేదు. నిజానికి దర్శకుడు ఆ ప్రేమకథను పాజిటివ్ గానే ముగించాలనుకున్నాడు. దానికోసమే హీరోయిన్ ఇంట్లో పనమ్మాయిగా సుచిత్ర పాత్రను ప్రవేశపెట్టాడు. మహర్షి సినిమాలోని 'మాట రాని మౌనమిది' పాటతో కలుపుదామనుకున్నాడు. అయితే లాగ్ అవుతుందని పసిగట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇందుకు ఎడిటర్ ని మెచ్చుకోవాల్సిందే. రామ్ హిట్ కొట్టినా సెకెండాఫ్ లో రొటీన్ అన్న పదం బాగానే వినపడింది. ఇప్పుడు ఈ సీన్ కూడా ఉండుంటే మహర్షి ప్రేమ ఫలించేదేమో గానీ రామ్ కి మాత్రం మరో ఎదురుదెబ్బ తగిలేదే..!