Begin typing your search above and press return to search.

అన్నం పెట్టిన టాలీవుడ్ ను మరువను

By:  Tupaki Desk   |   22 April 2017 11:05 AM GMT
అన్నం పెట్టిన టాలీవుడ్ ను మరువను
X
మన తెలుగు సినిమాలో ఇప్పుడు మనవాళ్లు కన్నా బయట రాష్ట్ర వాళ్ళు హల్ చల్ చాలా ఉంది. దానికి ఉన్న కారణాలు దానికి ఉన్నాయిలే. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ముఖ్యంగా విలన్లు అందరూ బయట నుండి వచ్చినవాలే. అలా వచ్చిన వాళ్ళలో ఒక విలన్ ప్రదీప్ రావత్. సై అండ్ ఛత్రపతి సినిమాలతో మనల్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు.

ప్రదీప్ రావత్ ని తీసుకొచ్చిన ఘనత మన తెలుగు జక్కన్న రాజమౌళి కి దక్కుతుంది. ప్రదీప్ రావత్ రాజమౌళిని తన గాడ్ ఫాదర్ గా భావిస్తాడు. అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమా లో క్రికెట్ జట్టు లో ఒక ప్లేయర్ గా చేసి అందరి దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ సినిమా చూసి రాజమౌళి తనకు అవకాశం ఇచ్చాడు అంటున్నాడు ప్రదీప్. అంతకన్నా ముందు చాలా చిన్న చిన్న వేషాలు వేసినా.. టి‌వి లో చేసినా.. అంతా గుర్తింపు రాలేదు. ''చాలా సినిమా వాళ్ళు నన్ను నా కష్టాన్ని వాడుకొని డబ్బులు ఇచ్చే వారు కాదు. అప్పుడు చాలా బాధ పడ్డ నేను మహాభారత్ టి‌వి సీరియల్ కూడా చేశా'' అంటూ సెలవిచ్చాడు.

ఇక బాలీవుడ్డా టాలీవుడ్డా అంటే.. ''సౌత్ ఇండియా లో నటులకు చాలా గౌరవం ఇస్తారు. అందుకే నాకు అన్నం పెట్టిన తెలుగు ఇండస్ట్రి అంటే చాలా గౌరవం. బాలీవుడ్ లో క్లాస్ రేసిజం (జాతి వివక్ష) చాలా ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఈ ఇండస్ర్టీని ఎప్పటికీ మర్చిపోను'' అంటూ సెలవిచ్చాడు ప్రదీప్ రావత్. మరి మొన్ననే అజయ్ ఘోష్‌ తెలుగు ఇండస్ర్టీని నానా తిట్టిపోసి సారి చెప్పాడుగా. అంతేలే.. ఎవరి ఫీలింగ్ వారిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/