Begin typing your search above and press return to search.

ప్ర‌గతి డ్యాన్సులు చూశాక బుల్లితెర డ్యాన్స్ షోలు మారాలి!

By:  Tupaki Desk   |   30 April 2021 5:30 AM GMT
ప్ర‌గతి డ్యాన్సులు చూశాక బుల్లితెర డ్యాన్స్ షోలు మారాలి!
X
సీనియ‌ర్ స‌హాయ‌ న‌టిగా ప్ర‌గ‌తి సుప‌రిచితం. అమ్మ అక్క పాత్ర‌ల‌తో త‌న స్థాయి వేరొక లెవల్ అని ప్రూవ్ చేసిన ఈ న‌టీమ‌ణి టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టు. న‌టి ప్రగతి ఇన్ స్టాగ్రామ్ లోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఫిట్ నెస్ ఔత్సాహికురాలు. త‌న సినిమా వ్య‌వ‌హారాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల్ని కూడా ప్ర‌గ‌తి ఈ వేదిక‌పై పంచుకుంటున్నారు.

నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా.. ప్రగతి పాపుల‌ర్ సాంగ్ కి డ్యాన్సులాడారు. డ్రీముమ్ వేకుపమ్ అనే త‌మిళ పాట‌కు త‌న‌ స్నేహితురాలు చైతూ చెర్రీతో క‌లిసి నృత్యం చేస్తున్న వీడియోను పోస్ట్ చేయ‌గా అది సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌గ‌తి చూడ‌టానికి కాస్త ఫ్యాటీగా క‌నిపించినా కానీ అలాంటి క్లిష్ఠ‌మైన‌ ఫ్లోర్& లెగ్ మూవ్ మెంట్స్ ని అంత సునాయాసంగా అద‌ర‌గొట్టేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ప‌రిశ్ర‌మ‌లో ఎంతో అనుభ‌వ‌జ్ఞురాలైన న‌టీమ‌ణి ప్ర‌గ‌తిలో ఈ ట్యాలెంట్ నిజంగా ప‌రిశీలించ‌ద‌గిన‌ది. చూస్తుంటే ఏదైనా డ్యాన్స్ బేస్డ్ సినిమాలో అవ‌కాశం ఇస్తే దుమ్మురేప‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ప్ర‌గ‌తిని చూశాక‌.. 40 ప్ల‌స్ మ‌హిళామ‌ణుల‌ కోసం ఒక ప్ర‌త్యేక‌ డ్యాన్స్ రియాలిటీ షో ఏదైనా బుల్లితెర‌పై ప్రారంభిస్తే టీఆర్పీ అద‌ర‌గొట్టేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియోకు నెటిజనుల‌ నుండి అద్భుత స్పందన వస్తోంది.