Begin typing your search above and press return to search.

ఒక్క సినిమా అనుభవం మంచిదే

By:  Tupaki Desk   |   2 Nov 2015 9:30 AM GMT
ఒక్క సినిమా అనుభవం మంచిదే
X
ఏ విషయం అయినా బాగా నేర్చుకోవాలంటే అనుభవం ఉండాలి. ఈ మాట అన్ని రంగాలతోపాటే ఫిలిం ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది. టాలీవుడ్ ని కిర్రెక్కిస్తున్న హీరోయిన్స్ కెరీర్ ని పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఓ నలుగురు తారలు ఓ సినిమాతో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కానీ.. వారి మొదటి మూవీ అదే కాదనే విషయం పెద్దగా ప్రచారం కాలేదు.

సినిమాలో ఉందంటే హిట్ కన్ఫామ్ అనేంత గుర్తింపు టాలీవుడ్ లో తెచ్చుకుంది సమంత. ఈమె ఏ మాయ చేశావే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అంతకంటే ముందు.. కోలీవుడ్ లో ఓ రెండు సినిమాలు చేసింది. గ్లామరస్‌ గా నటించినా కూడా అక్కడవి ఆడలేదు. కంచె రిలీజ్ అయ్యాక ప్రగ్యా జైస్వాల్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఈమె మొదటి సినిమా ఇది కాదు. మిర్చి లాంటి కుర్రాడు అనే మూవీలో అభిజిత్ అనే కుర్రాడి పక్కన హీరోయిన్ గా టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇక కుమారి 21ఎఫ్ ట్రైలర్ తోనే హీబా పటేల్ కి బాగా గుర్తింపు వచ్చింది. సెక్సీ లుక్‌ తో పిచ్చెత్తిచ్చింది. కానీ ఈమెకి కూడా ఇది రెండో సినిమానే. దీనికి ముందు అలా ఎలా అనే మూవీలో రాహుల్ రవీంద్రన్ తో రొమాన్స్ చేసింది.

అలాగే హోరాహోరీ తర్వాత రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరోయిన్ దక్షా నాగర్కర్ కి మంచి ఫేమ్ వచ్చింది. కొత్త పిల్ల సూపర్‌ అన్నారు జనాలు. కాని ఈమెకి ఏకే రావ్ పీకే రావ్ మూవీలో అంతకు ముందే నటించిన అనుభవం ఉంది. ఇలా ఓ అనుభవం తర్వాత నేర్చుకున్న పాఠాలు.. హీరోయిన్స్ కి బాగానే ఉపయోగపడుతున్నాయి. మాంచి స్ర్కీన్‌ ప్రెజన్సు చూపిస్తున్నారు ఈ భామలు సదరు అనుభవంతో..