Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు ముద్దుగుమ్మలు అదుర్స్‌

By:  Tupaki Desk   |   13 Nov 2022 5:07 PM GMT
ఫోటోటాక్ : ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు ముద్దుగుమ్మలు అదుర్స్‌
X
ఒక ఫోటోలో ఒక హీరోయిన్ ఉంటేనే చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు అంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఈ ఫోటోలో ఇద్దరు ముద్దుగుమ్మలు.. అది కూడా హాట్ బ్యూటీస్ ఇద్దరు ఫోటోకు ఫోజ్ ఇవ్వడంతో నెటిజన్స్ ఏ ముద్దుగుమ్మను చూడాలో అర్థం నెటిజన్స్‌ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా పరిస్థితి ఉంది.

కంచె సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ ఆ తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అయితే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత కారణంగా ఇప్పటికి కూడా రెగ్యులర్ గా మీడియా లో ఉంటూ వస్తుంది.

తాజాగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్ టాలీవుడ్‌ లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేసి స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ఏడాది కాలంలోనే రకుల్‌ ప్రీత్ సింగ్ పదికి పైగా సినిమా లు ఓకే చెప్పింది.

ఇప్పటికే అందులో కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీరిద్దరు ముంబయిలో రెగ్యులర్‌ గా అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూ ఉన్నారు. వీరిద్దరు తాజాగా ఒకే చోట ఇలా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మల యొక్క అందాల ఆరబోతకు జనాలు ఫిదా అవుతున్నారు.