Begin typing your search above and press return to search.

ముత్యాల చీరలో సీతాదేవి వచ్చిందోచ్

By:  Tupaki Desk   |   8 Aug 2016 4:32 AM GMT
ముత్యాల చీరలో సీతాదేవి వచ్చిందోచ్
X
ప్రగ్యా జైస్వాల్.. ఇంతకు ముందు మనకీ పేరు తెలీదు గానీ.. కంచె అనే ఒక్క మూవీతో టాలీవుడ్ కి సుపరిచితం అయిపోయింది. అంతగా సీతాదేవి పాత్రతో కనికట్టు చేసేసింది ప్రగ్య. కాదు కాదు.. అలా ఈ భామను చూపించాడు దర్శకుడు క్రిష్.

ఇప్పుడు క్రిష్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ పెళ్లికి కంచె హీరోయిన్ నడిచొచ్చింది చూడండి.. అబ్బబ్బా.. ఆ గెటప్ కే ఓ రెండొందల మార్కులు సీతాదేవికి వేసేయచ్చు. ట్రాన్స్ పరెంటే హాఫ్ వైట్ శారీ.. స్లీవ్ లెస్ జాకెట్ లో.. మిల్క్ వైట్ స్కిన్ ని చూపిస్తూ మెరిపించేసింది ప్రగ్యా జైస్వాల్. ఆ చీర డిజైన్ చూస్తేనే కళ్లు జిగేల్ మనడం ఖాయం. శారీ అంతా ముత్యాలతోనే డిజైన్ చేసేశారు. వాటిని ఎంబ్రాయిడరీ చేయడం కాకుండా.. ముత్యాలనే చీరలో ఓ పార్ట్ చేసేశారు డిజైనర్.

అంత అందమైన చీరలోంచి తొంగి చూసే ప్రగ్యా అందాలు మరో స్పెషల్ అట్రాక్షన్. ఇంతకీ ప్రగ్యా జైస్వాల్ ఒలకబోస్తున్న ముత్యాలను ఏరుకునే వాళ్లు ఎవరో!