Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వయ్యారంగా పెళ్ళికెళ్ళింది

By:  Tupaki Desk   |   24 Jun 2017 5:08 AM GMT
ఫోటో స్టోరి: వయ్యారంగా పెళ్ళికెళ్ళింది
X
కొంతమంది పెళ్ళిళ్ళలో పెళ్ళి కూతురు కన్నా ఎక్కువగా ముస్తాబై హడావిడి చేస్తారు. పెళ్ళి కూతురు ఫ్రెండ్ కావచ్చు చెల్లి కావచ్చు మరదలు కావచ్చు ఎవరో ఒకరు ఇలాంటి బాపతు ఉంటారు. వాళ్ళు ఆ పెళ్ళిలో బాగా హైలైట్ అవుతారు. సాధారణ పెళ్ళి లో అయితే ఇలాంటి విషయాలు జరుగుతాయి మరి హీరోయిన్ ఫ్రెండ్ పెళ్ళిలో లేక బాగా స్టేటస్ ఉన్నవారి పెళ్ళి అయితే అందరూ ఎవరికి వాళ్ళు స్టార్లా ఫీల్ అయిపోయి ముస్తాబు అయి వస్తారు.

ఇప్పుడు ఇక్కడ ఒక తెలుగు హీరోయిన్ కూడా అలానే వెళ్లింది ఒక ఫంక్షన్ కు. క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె సినిమాతో తెలుగులో పాపులరైన సితార.. ప్రగ్యా జైస్వాల్. కంచె సినిమాతో తెలుగులో ఒక మోస్తరు సినిమాలతో బిజీగానే ఉంది ఇప్పుడు. లేత వంగపండు రంగు సన్నటి బంగారుపు రంగు కలిసి ఉన్న లెహేంగా చోళి వేసుకొని వయ్యారంగా వెళ్లింది ఆమెకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్ కు. పెళ్ళికి వెళ్ళిన ఈమెకే పెళ్ళి కళ వచ్చినట్లు ఉంది ఇక్కడ ఈ డ్రెస్స్ లో చూస్తే. అందం అలంకరణ రెండు చక్కగా జత చేసి అక్కడకు వచ్చిన వారిని ఆమె నుంచి కళ్ళు తిప్పకోకుండా చేసుకొంది.

మొన్న విడుదలైన గుంటూరోడు సినిమాలో నటించినా అది ఫ్లాప్ కావడంతో అమ్మడుకు అంత పేరు రాలేదు. ఇప్పుడు బోయపాటి శ్రీను డైరక్షన్లో వస్తున్న ‘జయ జానికి నాయక’ సినిమాలో నటిస్తోంది. ఇంకా కృష్ణ వంశీ డైరక్షన్లో వస్తున్న ‘నక్షత్రం’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/