Begin typing your search above and press return to search.

సెలూన్ నుంచి వెళుతుంటే గుంపుగా మీద ప‌డ్డారు!

By:  Tupaki Desk   |   3 July 2021 12:40 PM GMT
సెలూన్ నుంచి వెళుతుంటే గుంపుగా మీద ప‌డ్డారు!
X
న‌గ‌రాల్లో ట్రాఫిక్ కూడ‌ళ్ల‌లో నిరంత‌రం యాచ‌కులు భిక్షాట‌న చేస్తుంటే మ‌న‌సున్న మారాజులు నొచ్చుకోకుండా త‌మ‌వంతు ప‌దో ప‌ర‌కో సాయ‌ప‌డుతుంటారు. కొంద‌రు యాచ‌కులు అయితే ఎలాగైనా వెంట‌ప‌డి మ‌రీ గుంజేస్తారు. ఇదే స‌న్నివేశం స్ఫూర్తితో పోకిరిలో బ్ర‌హ్మానందం స‌న్నివేశాన్ని తీర్చిదిద్దిన తీరు నేటికీ మ‌ర్చిపోలేం. బిచ్చ‌గాళ్ల‌కు అసోసియేన్లు యూనిటీ అనే టాపిక్ ని ఎంతో వినోదాత్మ‌కంగా జ‌న‌రంజ‌కంగా తెర‌పై ఆవిష్క‌రించిన ఘ‌న‌త ది గ్రేట్ పూరి స‌ర్ దే.

కానీ ఇప్పుడు రియాలిటీలోనూ అలాంటి స‌న్నివేశ‌మే ఎదురైంది ముంబై బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ కి. అలా ట్రాఫిక్ కూడ‌లిలో కార్ ఆపి సెలూన్ కి వెళ్లి వ‌స్తున్న త‌న‌పై గుంపుగా ప‌డ్డారు యాచ‌కులు. అయితే త‌న‌ను వెంబ‌డిస్తున్న వారిని కాద‌నకుండా త‌న ప‌ర్సులోంచి మ‌నీ తీసి వారికి సాయ‌ప‌డింది. త‌న మంచి మ‌న‌సును చాటుకుంది ఆ క్ష‌ణం. అయితే ఆ వీడియో చూడ‌గానే పోకిరిలో బ్ర‌హ్మీ స‌న్నివేశాన్ని త‌ల‌చుకుంటున్నారు నెటిజ‌నం. అరే .. ప్ర‌గ్య‌కు ఎంత క‌ష్ట‌మొచ్చింది పోకిరిలో బ్ర‌హ్మీలా అంటూ పంచ్ లు వేస్తున్నారు.

ఇటీవ‌లి కరోనా క్రైసిస్ ప్ర‌భావం బిచ్చ‌గాళ్ల ఇండ‌స్ట్రీపైనా తీవ్రంగానే ప‌డింది. ఇప్ప‌టికే న‌గరాల్లో యాచ‌కుల సంఖ్య అనూహ్యంగా త‌గ్గిపోయింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మాయ‌దారి మ‌హ‌మ్మారీ సోకి చాలామంది ఆయారాం గ‌యారాం అన్న‌ట్టే అయ్యింది ప‌రిస్థితి. బ‌స్ స్టాండ్ లు రైల్వే స్టేష‌న్లు పార్కులు పార్కింగ్ స్థ‌లాలు ఎక్క‌డా బిచ్చ‌గాళ్ల‌కు నో రూమ్ బోర్డ్ ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో నిలువ‌నీడ లేక తిన‌డానికి తిండి లేక చాలామంది ప‌లాయ‌నం చిత్త‌గించారు.

ఇటీవ‌లి కాలంలో బిచ్చ‌గాళ్ల‌ను డ‌బ్బు ఇచ్చి పోషించ‌కుండా ఆహారం పొట్లాలు మాత్ర‌మే అందించాల‌ని అవేర్ నెస్ తీసుకురావ‌డం వ‌ల్ల‌నూ యాచ‌కుల ప‌ర్సంటేజీ త‌గ్గ‌డానికి సాయ‌ప‌డి ఉంటుంద‌ని భావిస్తున్నారు. మొత్తానికి ప్ర‌గ్య లాంటి వారికి ఇలా రేర్ గానే ఇలాంటివి ఎదువుతుంటాయి. ఎన్ని క్రైసిస్ లు వ‌చ్చినా మ‌న దేశంలో భిక్షాట‌న‌ను మాన్పించ‌డం క‌ష్ట‌మనేందుకు ఈ దృశ్యం ప్ర‌త్య‌క్ష సాక్ష్యంగా భావించ‌వ‌చ్చు.

ప్ర‌గ్య జైశ్వాల్ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. త‌న లాంగ్ వెయిటింగ్ ఫ‌లించి ఇప్ప‌టికి కెరీర్ ప‌రంగా పెద్ద అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటోంది. బాల‌య్య స‌ర‌స‌న అఖండ‌లో న‌టిస్తున్న ఈ బ్యూటీ స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలోనూ అవ‌కాశం అందుకుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.