Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: కెవ్వుకేక.. కంచె పాప
By: Tupaki Desk | 4 July 2019 5:02 PM GMT'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రగ్య జైస్వాల్. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో ప్రగ్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ప్రగ్య కెరీర్ స్లో అయింది. అలా అని ప్రగ్య నిరాశతో వైరాగ్యం పెంచుకునే బాపతు కాదు. అందుకే సోషల్ మీడియాలో ఘాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ చెలరేగిపోతోంది.
తాజాగా ప్రగ్య తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ప్రగ్య "మీ విలువ తెలుసుకోండి.. దానికి టాక్స్ కలపండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే ప్రతిదానికి టాక్సులు వేస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కొన్ని టాక్సులు ఎందుకు వేస్తారో.. ఎందుకు వసూలు చేస్తారో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు "మనం కూడా టాక్స్ వేస్తే పోలా.." అనేది ప్రగ్యా ఆలోచన. కరెక్టే కానీ డిమాండ్ ఉండే దానికి టాక్స్ వేస్తే కడతారు.. డిమాండ్ లేని వాళ్ళు మాత్రం టాక్స్ ఎవరికి వెయ్యాలి? వారికి వారే వేసుకోవాలి!
ఈ టాక్స్ గోల ఎందుకు కానీ.. ఫోటో సంగతే మాట్లాడుకుందాం. మెరూన్ కలర్ డ్రెస్ ధరించిన ప్రగ్య తన అందాలను ఫుల్లుగా అరమరికలు లేకుండా వడ్డించింది. టాప్ కు వీ నెక్.. లేస్ లాంటి డిజైన్ ఉండడంతో అదో అందం.. ఇక పొడవాటి డ్రెస్ ఉన్నప్పటికీ కాళ్ళ అందాలు బయటపడిపోయాయి. ప్రగ్య కూర్చున్న పోజు.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ యమా హాటుగా ఉంది. నెటిజన్లకు ఈ ఫోటో తెగనచ్చడంతో ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "స్టన్నింగ్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్".. "గాడ్ ఈజ్ గ్రేట్..నువ్వో ఏంజెల్".. "కెవ్వుకేక".. "గ్లామర్ టాక్స్ వెయ్యండి" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా' లో ఒక కీలకపాత్రలో నటిస్తోంది.